- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దారుణం.. భార్యను గొంతు నులిమి చంపిన భర్త
దిశ, శంకర్పల్లి : కట్టుకున్న వాడే కాలయముడయ్యాడు. సొంత భార్యను గొంతు పిసికి అతి దారుణంగా హతమార్చాడు. మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతూ దారుణానికి ఒడికట్టాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కొజ్జగూడెం గ్రామానికి చెందిన సరిత(25)ను కొత్తపల్లి గ్రామానికి చెందిన ఒగ్గు శ్రీకాంత్‌తో సుమారు ఏడు సంవత్సరాల క్రితం పెద్దలు వివాహం జరిపించారు. పెళ్లయిన ఆరు నెలల వరకు అంతా బాగానే ఉన్న ఒగ్గు శ్రీకాంత్ తదనంతరం నిత్యం భార్యను వేధించేవాడు. బూతులు తిడుతూ, శారీరకంగా వేధిస్తూ ఇబ్బందులకు గురి చేసేవాడు. గత 15 రోజుల క్రితం ఇబ్బందులకు గురి చేయడంతో సరిత తన తల్లి గారి ఇల్లు అయిన కొజ్జ గూడెం గ్రామానికి వచ్చింది. ఒగ్గు శ్రీకాంత్ అత్తారింటికి వచ్చి తన భార్యను తనతో పంపించాలని కోరగా అత్తమామలు పంపించలేదు.
చేసేదేం లేక కొత్తపల్లి గ్రామానికి వెళ్లిన శ్రీకాంత్ ఇంట్లో ఉరేసుకునేందుకు ప్రయత్నించాడు. శ్రీకాంత్ తల్లి కోడలు సరితకు ఫోన్ చేసి నీవు రాకపోతే ఉరేసుకొని పోతాడట, ఉరేసుకుంటుంటే మేము ఆపామని తెలిపింది. కాగా ఒకటి రెండు రోజుల తదనంతరం శ్రీకాంత్ తల్లి, పెదనాన్న, మేనమామలు కలిసి కొజ్జ గూడెం గ్రామానికి వెళ్లి సరితతో పాటు పిల్లలను తీసుకెళ్లారు. ఆదివారం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో భార్య కాలితో తొక్కి, ఆమె మీద కూర్చుని రెండు చేతులతో గొంతు పిసికి అతి దారుణంగా హత్య చేశాడు. హత్య చేసిన అనంతరం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో శంకర్పల్లి పీఎస్‌కు వచ్చి తన భార్యను చంపానని చెప్పి పోలీసులకు లొంగిపోయాడు. తల్లి చనిపోవడం, తండ్రి జైలుకు వెళ్లడంతో ఐదు సంవత్సరాల వర్షిత్, మూడు సంవత్సరాల ప్రీతికలు దిక్కు లేని వారయ్యారు.