బ్రేకింగ్: మరో పరీక్ష పేపర్ లీక్.. ఆ ఎగ్జామ్‌ను రద్దు చేసే యోచనలో TSPSC..!

by Satheesh |   ( Updated:2023-03-13 14:27:31.0  )
బ్రేకింగ్: మరో పరీక్ష పేపర్ లీక్.. ఆ ఎగ్జామ్‌ను రద్దు చేసే యోచనలో TSPSC..!
X

దిశ, వెబ్‌డెస్క్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. పేపర్ లీక్ కారణంగా ఈ నెల 13వ తేదీన జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్ష రద్దు కాగా.. తాజాగా మరో పరీక్ష పేపర్ కూడా లీకైనట్లు అధికారులు గుర్తించారు. ఈ నెల 5వ తేదీన జరిగిన అసిస్టెంట్ ఇంజనీరింగ్ పరీక్ష పేపర్ కూడా లీక్ అయినట్లు పోలీసులు గుర్తించారు. పరీక్ష కంటే రెండు రోజుల ముందే పేపర్ లీక్ అయినట్లు అధికారులు తెలిపారు. దీంతో అసిస్టెంట్ ఇంజనీరింగ్ పరీక్షను రద్దు చేసే యోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా పేపర్ లీక్ కారణంగా ఈ నెల 15, 16వ తేదీల్లో జరగాల్సిన పరీక్షలను అధికారులు ఇప్పటికే వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story