- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Assembly: తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం!
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్న వేళ అసెంబ్లీ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పలు డిమాండ్లను లేవనెత్తుతూ పీడీఎస్‌యూ విద్యార్ధి సంఘాలు ఆందోళన నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపధ్యంలో రాష్ట్రంలోని పీడీఎస్‌యూ విద్యార్ధి సంఘం ఆధ్వర్యంలో ఛలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రియంబర్స్ మెంట్ లను తక్షణమే విడుదల చేయడం సహా పలు డిమాండ్లు చేస్తూ అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నించారు. నినాదాలు చేస్తూ.. అసెంబ్లీ వైపు దూసుకెళ్లేందుకు యత్నించారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో విద్యార్ధి నాయకులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతవారణం చోటుచేసుకుంది. పోలీసుల తీరుకు వ్యతిరేఖంగా పీడీఎస్‌యూ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆందోళన చేస్తున్న విద్యార్ధి సంఘం నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుండి తరలించారు.