- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కార్తీక పౌర్ణమి స్పెషల్.. అరుణాచలం గిరి ప్రదక్షిణకు ప్రత్యేక టూర్ ప్యాకేజీ
దిశ, వెబ్ డెస్క్: కార్తీక మాసం(Kartika masam) ప్రారంభం అవ్వడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న శైవ ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. కార్తీక మాసం సందర్భంగా శివ భక్తులు దేశంలోని ప్రతిష్ట పుణ్యక్షేత్రాలను సందర్శిస్తుంటారు. ఇందులో మరీ ముఖ్యంగా.. అరుణాచలం(arunachalam)లో వెళ్లి అక్కడ గిరి ప్రదక్షిణలు తప్పకుండా చేస్తుంటారు. అలాంటి వారికి తెలంగాణ ఆర్టీసీ శుభవార్తను అందించింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా పరమశివుణి దర్శనం కోసం అరుణాచలం గిరి ప్రదక్షిణ టూర్ ప్యాకేజీని ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ఈ ప్యాకేజీలో కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామితో పాటు వెల్లూరులోని గోల్డెన్ టెంపుల్‌ను సందర్శించే సౌకర్యాన్ని టీజీ ఆర్టీసీ(TG RTC) సంస్థ కల్పిస్తోంది.
ఈ ప్యాకేజీలో భాగంగా.. తెలంగాణలోని హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఈ నెల 15న కార్తీక పౌర్ణమి కాగా, 13 నుంచి ఆయా ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయి. కాణిపాకం, గొల్డెన్ టెంపుల్ దర్శనం తర్వాత కార్తీక పౌర్ణమి పర్వదినం నాడు అరుణాచలానికి చేరుకుంటాయి. కాగా ఈ అరుణాచల గిరి ప్రదక్షిణ ప్యాకేజీని http://tgsrtcbus.in వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-23450033, 040-69440000 సంప్రదించవచ్చని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.