- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి : మంత్రి శ్రీధర్ బాబు
దిశ, శంకర్పల్లి : ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని రాష్ట్ర ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని సింగాపూర్ గ్రామంలో బుధవారం నూతనంగా నిర్మించిన శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం లో భాగంగా మొదటి రోజు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతినిత్యం ఎన్నో కార్యక్రమాలతో బిజీగా ఉంటారని దైవ కార్యక్రమంలో పాలు పంచుకోవడం ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుందని పేర్కొన్నారు. గ్రామస్తులు ఐక్యంగా ఆంజనేయస్వామి దేవాలయ నిర్మాణం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు చేపట్టడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పామేనా భీమ్ భరత్, వార్డు కౌన్సిలర్ బొడ్డు లావణ్య శ్రీనివాస్ రెడ్డి, సంతోష్ రాథోడ్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి గ్రామ పెద్దలు మహిళలు పాల్గొన్నారు.