Bitcoin: ట్రంప్ ఎఫెక్ట్.. రికార్డు స్థాయిలో 75,000 డాలర్లు దాటిన బిట్‌కాయిన్

by S Gopi |
Bitcoin: ట్రంప్ ఎఫెక్ట్.. రికార్డు స్థాయిలో 75,000 డాలర్లు దాటిన బిట్‌కాయిన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలుపు ఖాయం కావడంతో క్రిప్టో మార్కెట్లో ఉత్సాహం ఊపందుకుంది. బిట్‌కాయిన్ కొత్త ఆల్‌టైమ్ గరిష్ఠం 75,000 మార్కును అధిగమించింది. యూఎస్ అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ట్రంప్ హవా కొనసాగడం, మార్కెట్ సెంటిమెంట్ బలంగా ఉండటమే ఇందుకు కారణం. బుధవారం ఉదయం బిట్‌కాయింట్ 8.4 శాతం మేర పెరిగి 75,060 వద్ద ఉంది. బిట్‌కాయిన్‌తో పాటు ఇతర క్రిప్టో కరెన్సీలు సైతం మెరుగైన ర్యాలీ చూస్తున్నాయి. ఎన్నికల ప్రచారం సమయంలో ట్రంప్ క్రిప్టో కరెన్సీకి సంబంధించి కీలక హామీలు ఇచ్చారు. ప్రధానంగా తాను వైట్‌హౌస్‌కు తిరిగి వస్తే, ప్రభుత్వం తన బిట్‌కాయిన్ హోల్డింగ్‌లను ఎప్పటికీ విక్రయించకుండా చూస్తానని చెప్పారు. అంతేకాకుండా తమ పార్టీ మద్దతుదారులకు బీర్లు, చీజ్ బర్గర్లు కొనేందుకు ట్రంప్ బిట్‌కాయిన్ వాడారు. అందువల్లే బిట్‌కాయిన్ కొత్త రికార్డులకు చేరింది. దీంతో పాటు ఇతర క్రిప్టోకరెన్సీలలో ఈథర్ 7.2 శాతం పెరిగి 2,576 డాలర్లకు, బీఎన్‌బీ(5 శాతం), సొలానా(13.5 శాతం), డిజీకాయిన్(21.6 శాతం), చైన్‌లింక్(11.4 శాతం) పెరిగాయి.

Advertisement

Next Story

Most Viewed