వైసీపీ ఎస్ఎమ్ కో ఆర్డినేషటర్ల అరెస్ట్: మాజీ ఎమ్మెల్యే కాసు ఆగ్రహం

by srinivas |
వైసీపీ ఎస్ఎమ్ కో ఆర్డినేషటర్ల అరెస్ట్: మాజీ ఎమ్మెల్యే కాసు ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వంతో పాటు పలువురు ప్రముఖులపై కించపరుస్తూ పోస్టులు పెడుతున్న వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ల(YCP Social Media Coordinators)ను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం, పోలీసుల తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు(YSR Congress leaders) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే అణిచివేస్తామని, కేసులు పెడతామంటే ఎలా? అని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి(Gurajala Former MLA Kasu Mahesh Reddy) ప్రశ్నించారు. ఈరోజు 100 మందిని అరెస్ట్ చేయవచ్చని, కానీ రేపు ఆ 100 మంది 2 లక్షల మంది అవుతారని, అప్పుడు జైళ్లు సరిపోతాయా? అని నిలదీశారు. వైయస్‌ఆర్‌సీపీ(YSRCP)లోని ప్రతి కార్యకర్త ఒక సోషల్ మీడియా సైనికుడు అవుతాడని కాసు మహేష్‌ రెడ్డి హెచ్చరించారు. ‘‘ప్రజా స్వామ్యంలో సోషల్ మీడియా అనేది ఒక అస్త్రం, స్వేచ్ఛగా అభిప్రాయాలు తెలిపే ప్లాట్ ఫ్లామ్. తప్పుడు పోస్టులపై ఖండించే అధికారం ప్రభుత్వానికి ఉంది. కానీ అక్రమంగా కేసులు పెట్టడం, అరెస్ట్‌‌లు చేయడం సరికాదు.’’ అని కాసు మహేశ్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed