- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rakesh Varre: సెలబ్రిటీలపై ఫైర్ అవుతూనే మూవీ లవర్స్‌కు బంపర్ ఆఫర్ ప్రకటించిన బాహుబలి నటుడు..
దిశ, వెబ్‌డెస్క్: ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఎదిగిన వారిలో రాకేష్ వర్రే(Rakesh Varre) ఒకరు. అయితే గతంలో నక్సలైట్స్ తో ప్రజల కోసం పోరాడిన ఓ తెలంగాణ నాయకుడు జితేందర్ రెడ్డి (Jitender Reddy)బయోపిక్ లో రాకేష్ వర్రే నటించిన విషయం తెలిసిందే. చాలా కాలంగా ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తుంది. ఎన్నో వాయిదాల తర్వాత ఇప్పుడు జితేందర్ రెడ్డి సినిమాకు ముహూర్తం వచ్చింది. ఈ నెల (నవంబర్) 8న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. కాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాకేష్ వర్రే మాట్లాడుతూ.. సినీ పరిశ్రమకు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చానని అన్నాడు.
కానీ పరిశ్రమలో సెటిల్ అవ్వడానికి చాలా సమయం పట్టిందని, పేక మేడలు(Peka Medalu) సినిమాకు నిర్మాతగా వ్యవహరించానని, కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయడం కోసమే ఈ మూవీని నిర్మించానని అన్నాడు. ఈ సినిమా వల్ల మనీ, టైమ్ రెండు వేస్ట్ అయ్యాయని తెలిపాడు. కానీ పేక మేడలు వల్ల మంచి లెస్సన్ నేర్చుకున్నానని వెల్లడించాడు. అలాగే సెలబ్రిటీల గురించి మాట్లాడారు. సెలబ్రిటీస్ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోతే గెస్టులుగా రారని, ఫ్రెండ్షిప్ ఉంటేనో లేక ఆబ్లిగేషన్ మీదో వస్తారని కాస్త ఫైర్ అయ్యాడు రాకేష్.
సెలబ్రిటీ ఉంటేనే మూవీ ప్రమోట్ అవుద్ధి అనుకునేలా అందరి మైండ్ సెట్ చేశారన్నాడు. సినీ ఇండస్ట్రీకి వచ్చేవాళ్లకు ఒక సజెషన్ ఇస్తూ.. సెలబ్రిటీని తెచ్చే బదులు మూవీని మార్కెటింగ్ చేసుకోండని చెప్పాడు. సెలబ్రిటీలు(Celebrities) రారు కాబట్టి ఇదే బెస్ట్ అన్నాడు. నేను అయితే ఈ చిత్రం కోసం చాలా మంది సెలబ్రిటీలను వచ్చి సపోర్ట్ చేయమని అడుకున్నానని, కానీ ఎవరు రాలేదని కాస్త ఎమోషన్ అయ్యాడు. సినిమాను తీసుకెళ్లేది సెలబ్రిటీస్, డిస్ట్రిబ్యూటర్స్(Distributors) కాదని.. కాగా వారి వెంట తిరగకండంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అలాగే ఈ చిత్రానికి 75 రూపాయలతోనే ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాం అని వెల్లడించాడు.