- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Vidyalaxmi: విద్యార్థులకు రూ.10లక్షల లోన్.. ‘పీఎం విద్యాలక్ష్మి’ స్కీమ్‌కు కేబినెట్ ఆమోదం
దిశ, నేషనల్ బ్యూరో: దేశంలోని పేద విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ‘పీఎం విద్యాలక్ష్మి’ (Pm vidhyalaxmi) అనే పథకాన్ని తీసుకొచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ స్కీమ్‌కు ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా ఎలాంటి షురిటీలు లేకుండా స్టూడెంట్స్‌కు రుణాలు అందజేయనుంది. కుటుంబ వార్షికాదాయం రూ. 8లక్షల లోపు ఉన్న విద్యార్థులు దీనికి అర్హులు. వారికి 3శాతం వడ్డీ రాయితీ కింద రూ.10 లక్షల వరకు రుణాలు కేంద్ర ప్రభుత్వం అందజేయనుంది. దేశ వ్యాప్తంగా 860 విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఈ పథకం వర్తించనుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఏటా 22 లక్షల మందికి పైగా విద్యార్థులు లబ్ది పొందనున్నారు.
బ్యాంకులు కవరేజీని విస్తరించడంలో సహాయపడటానికి, రూ. 7.5 లక్షల వరకు రుణ మొత్తంపై భారత ప్రభుత్వం 75శాతం క్రెడిట్ గ్యారంటీని అందిస్తుంది. సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ పథకానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత విద్యకు దూరమవుతున్న విద్యార్థులకు పీఎం విద్యాలక్ష్మి పథకం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం స్కీమ్ లక్ష్యమని స్పష్టం చేశారు. అయితే, ప్రభుత్వం ఈ రుణానికి గరిష్ట పరిమితిని నిర్ణయించలేదు. అవసరాన్ని బట్టి ఈ లోన్ మొత్తాన్ని కూడా పెంచుకునే చాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.
ఎఫ్‌సీఐకి రూ.10,700 కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో మూలధన అవసరాలను తీర్చడానికి ప్రభుత్వ రంగ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ)లో రూ.10,700 కోట్ల ఈక్విటీ క్యాపిటల్ ఇన్‌ఫ్యూషన్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం, దేశవ్యాప్తంగా రైతుల సంక్షేమానికి భరోసా ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఎఫ్‌సీఐని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.