- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సర్వే పకడ్బందీగా చేయాలి : కలెక్టర్ ప్రతీక్ జైన్
దిశ, పరిగి : ఒక్క ఇంటికి కూడా వదల కుండా సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. పరిగి మున్సిపల్ పరిధిలోని 5వ వార్డు, మండల పరిధిలోని సుల్తాన్ పూర్ గ్రామంలో బుధవారం సర్వే నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ సమగ్ర కుటుంబ సర్వే కు ఇళ్లకు వచ్చే అధికారులకు ప్రజలు సహకరించాలన్నారు. సామాజిక ,ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఏ విధంగా నిర్వహిస్తున్నారన్న విషయాన్ని ప్రజలను, సర్వే చేస్తున్న అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఒక్క ఇంటిని కూడ వదలకుండాప్రతి ఇంటిని సర్వే చేయాలనీ అన్నారు. ప్రతి ఒక ఇంటిలో ఎంత మంది కుటుంబ సభ్యులు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయన్న వివరాలు పొందు పరచాలన్నారు. ఇంటి నెంబర్ లేని ఇండ్లు ఉన్నాయా, ఏమైనా సమస్యలున్నాయా అని అడుగగా పరిగి మున్సిపల్ పరిధిలో 400లకు పైగా ఇంటి నెంబరు లేని ఇళ్లు ఉన్నాయని మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య తెలిపారు. సర్వే కోసం వచ్చిన ఎన్యుమరేటర్లకు సరైన సమాచారాన్ని ఇచ్చి సహకరించాల్సిందిగా ఇంటి సభ్యులను కోరారు.రాష్ట్ర ప్రభుత్వం సామాజిక ,ఆర్థిక, విద్య ,ఉపాధి, రాజకీయ ,కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. తప్పుడు సమాచారం ఇవ్వకుండా సరైన సమాచారం ఇవ్వాలన్నారు.
ఇండ్లను సందర్శించి ఇండ్ల జాబితాను రూపొందించడం జరుగుతుందని, ప్రజలు ఆధార్ కార్డు, రేషన్ కార్డు,ధరణి పట్టాదారు పాస్ బుక్ వంటివి సిద్ధంగా పెట్టు కొని ఎన్యుమరేటర్లకు అందుబాటులో ఉండి సమాచారం ఇచ్చి సహకరించాలని అన్నారు. సర్వే ఫారంలో ఎన్యుమరేటర్లు ఎట్టి పరిస్థితులలో తప్పులు నింపవద్దని,ఏవైనా సందేహాలు ఉంటే సూపర్ వైజర్లు, మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవోలను సంప్రదించి నివృత్తి చేసుకోవాలన్నారు.ఇండ్ల జాబితా తయారీ సందర్బంగా ఇంటిని సందర్శించినట్లుగా స్టిక్కర్ అతికించాలని తెలిపారు. ఇంకా స్టిక్కర్లు కావాలంటే కార్యాలయానికి వచ్చి తీసుకోవాలన్నారు. సర్వే ఫారం లో పూర్తి వివరాలను నింపాలన్నారు. సమగ్ర సర్వేకు వివరాలు ఇచ్చేందుకు ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.ఈ సర్వే పరిశీలన కార్యక్రమంలో కలెక్టర్ వెంట డి ఆర్ డి ఏ శ్రీనివాస్, తహసిల్దార్ ఆనంద్ రావు , ఎన్యుమరేటర్లు ఉన్నారు.