- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
America Vice President: అమెరికా వైస్ ప్రెసిడెంట్ గా ఆంధ్రా అల్లుడు.. ఉషా చిలుకూరి ఊరిలో సంబరాలు
దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్ష పీఠం మరోసారి డొనాల్డ్ ట్రంప్ ను వరించింది. 277 ఎలక్టోరల్ ఓట్లతో అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ తిరుగులేని విజయాన్ని అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈసారి అమెరికా వైస్ ప్రెసిడెంట్ గా ఆంధ్రా అల్లుడు ఎంపికయ్యారు. అతను పుట్టి, పెరిగింది అమెరికాలోనే. అమెరికనే. కానీ.. ఆంధ్రా బీజాలున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో.. ఆంధ్రా అల్లుడయ్యాడు.
ఒహాయో (Ohio) రాష్ట్ర సెనేటర్ గా జేడీ వాన్స్ (JD Vance)ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేసుకున్నారు ట్రంప్. అప్పటి నుంచీ అతని భార్య ఉష చిలుకూరి (Usha Chilukuri) మార్మోగింది. తాజాగా రిపబ్లికన్లు గెలిచి.. అమెరికాలో అధికారాన్ని సొంతం చేసుకోవడంతో మరోసారి ఆమె పేరు తెరపైకొచ్చింది.
ఉష చిలుకూరి పూర్వీకుల మూలాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గానికి సమీపంలోని ఉండ్రాజవరం మండలం వడ్లూరు ఉండేవారు. తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మి 1980లోనే అమెరికా వెళ్లి.. స్థిరపడ్డారు. అక్కడే ఉష చిలుకూరి జన్మించారు. ముగ్గురు సంతానంలో ఈమె ఒకరు. తండ్రి క్రిష్ చిలుకూరి (Krish Chilukuri) ఏరోస్పేస్ ఇంజినీర్. అలాగే యునైటెడ్ టెక్నాలజీస్ ఏరోస్పేస్ సిస్టమ్స్ ఏరోడైనమిక్స్ స్పెషలిస్ట్ గా పనిచేశారు. ఆ తర్వాత కాలిన్స్ ఏరోస్పేస్ లో అసోసియేట్ డైరెక్టర్ గా చేశారు. తల్లి లక్ష్మి.. మాలిక్యులర్ బయాలజీ, బయో కెమిస్ట్రీ రంగంలో నిష్ణాతురాలు. ప్రస్తుతం ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఆమె.. శాన్ డియాగో యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేటివ్ పదవిలో ఉన్నారు.
శాండియాగో లో పుట్టిన ఉష.. యేల్ యూనివర్సిటీ (yale university) నుంచి హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీ (cambridge university)లో ఫిలాసఫీలో మాస్టర్స్ పూర్తి చేశారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ జాన్ రాబర్ట్స్, జస్టిస్ బ్రెట్ కెవానా వద్ద విధులు నిర్వర్తించారు. యేల్ యూనివర్సిటీలో లా అండ్ టెక్ జర్నల్ కు మేనేజింగ్ ఎడిటర్ గా, యేల్ లా జర్నల్ కు ఎగ్జిక్యూటివ్ డెవలప్ మెంట్ ఎడిటర్ గా పనిచేశారు. యేల్ లా స్కూల్ లో ఉషాకు జేడీ వాన్స్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారగా.. 2014లో హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం.
ఉషా చిలుకూరి ఆంధ్రా మూలాలున్న అమ్మాయి కావడం, ఆమె భర్త జేడీ వాన్స్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నిక కావడంతో వడ్లూరులో పండుగ వాతావరణం నెలకొంది. ఆమె పూర్వీకులున్న ఇంటివద్ద గ్రామస్తులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.