- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: BJP జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: పార్టీ సంస్థాగత మార్పుల్లో భాగంగా తెలంగాణ బీజేపీలో పార్టీ అధిష్టానం సంచలన మార్పులు చేసింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎంపీ బండి సంజయ్‌ను తొలగించి.. స్టేట్ చీఫ్ బాధ్యతలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి అప్పగించింది. అంతేకాకుండా టీబీజేపీ కీలక నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు ఎన్నికల కమిటీ చైర్మన్ పదవిని కట్టబెట్టింది. ఇదిలా ఉండగా.. ఇవాళ బీజేపీ అధిష్టానం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
కొంతకాలంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ బీజేపీ కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆదేశాల మేరకు బుధవారం పార్టీ జాతీయ కార్యదర్శ అరుణ్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తోందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇకపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా వ్యవహరించున్నారు.
అయితే, గత కొంతకాలంగా కోమటిరెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికీ చేరుతారని తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇందుకోసం ఆయన సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చర్చలు కూడా జరుపుతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. మరోవైపు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన పొంగులేటి, జూపల్లి కూడా రాజగోపాల్ రెడ్డితో చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ క్రమంలో బీజేపీ అధిష్టానం రాజగోపాల్ రెడ్డిని జాతీయ కార్యవర్గంలోకి తీసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.