విద్యామండలి చైర్మన్‌తో పాటు పలు యూనివర్సిటీలకు ఇంచార్జీ వీసీల నియామకం

by Mahesh |   ( Updated:2024-10-16 06:21:45.0  )
విద్యామండలి చైర్మన్‌తో పాటు పలు యూనివర్సిటీలకు ఇంచార్జీ వీసీల నియామకం
X

దిశ, వెబ్ డెస్క్: గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న తెలంగాణ ఉన్నత విద్యా మండలి(Telangana Council of Higher Education) చైర్మన్ పోస్టును ప్రభుత్వం భర్తీ చేసింది. ఈ క్రమంలో ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి ఉన్నత విద్యామండలి చైర్మన్ గా, వైస్ చైర్మన్‌గా ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తంలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరు ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. వీరి నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి ప్రస్తుతం నల్సార్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్నారు.

అలాగే రాష్ట్రంలోని పలు యూనివర్సిటీల ఇంఛార్జ్ వీసీలను సైతం మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇటీవల చాకలి ఐలమ్మ యూనివర్సిటీగా ఏర్పడిన కోటి మహిళా కళాశాలకు ఇంఛార్జి విసిగా ధనావత్ సూర్యను, బాసర ఐఐఐటీ ఇంఛార్జి వీసీగా ప్రొఫెసర్ గోవర్ధన్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ మ‌హిళా యూనివ‌ర్సిటీ( Telangana Womens University ) ఇంఛార్జ్ వీసీగా నియామ‌కం అయిన ధ‌న‌వాత్ సూర్య( Dhanavath Surya ) ప్రస్తుతం ఉస్మానియా యూనివ‌ర్సిటీ ఆర్ట్స్ క‌ళాశాల( Arts College) తెలుగు విభాగంలో ప్రొఫెస‌ర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Advertisement

Next Story