బ్రేకింగ్: గద్దర్ మరణానికి కారణం అదే.. వెల్లడించిన వైద్యులు

by Satheesh |   ( Updated:2023-08-06 11:28:29.0  )
బ్రేకింగ్: గద్దర్ మరణానికి కారణం అదే.. వెల్లడించిన వైద్యులు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ప్రజా గాయకుడు ఆకస్మిక మరణం యావత్ తెలంగాణను దిగ్ర్భాంతికి గురిచేసింది. ప్రజా గొంతు మూగబోయిందని తెలిసి ఆయన అభిమానులు, రచయితలు, కళాకారులు శోకసంద్రంలో మునిగిపోయింది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న గద్దర్.. హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. గద్దర్ మరణంపై అపోలో ఆసుపత్రి ప్రెస్‌నోట్ విడుదల చేసింది.

ప్రముఖ గాయకుడు గుమ్మడి విఠల్ (గద్దర్ 77) ఊపిరితిత్తులు, యూరినరీ సమస్యలతో మృతి చెందినట్లు తెలిపారు. గుండె సంబంధిత సమస్యలతో జూలై 20న గద్దర్ అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆగస్ట్ మూడవ తేదీన ఆయనకు బైపాస్ సర్జరీ జరగగ.. ఆయన దాని నుండి ఆయన రికవరీ అయ్యారని తెలిపారు. అయితే, గతంలోనే గద్దర్‌కు ఊపిరితిత్తులు, యూరినరీ సమస్యల ఉండగా.. తాజాగా అవి ఫెయిల్ అవడంతో ఆయన మృతి చెందినట్లు వెల్లడించారు.

Read More..

ప్రజా యుద్ధ నౌక గద్దర్ ప్రస్థానం ఇదే.. ఒంట్లో తూటాతోనే..

బిగ్ బ్రేకింగ్: ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూత

Advertisement

Next Story