AP, తెలంగాణ అడవుల సరిహద్దులు ఫిక్స్.. పదేళ్ల పూర్తవడంతో గట్టు పంచాయితీలపై చర్చ..!

by Satheesh |
AP, తెలంగాణ అడవుల సరిహద్దులు ఫిక్స్.. పదేళ్ల పూర్తవడంతో గట్టు పంచాయితీలపై చర్చ..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రెండు తెలుగు రాష్ట్రాల అడవులు సరిహద్దులు ఫిక్స్ చేసేందుకు అధికారులు కసరత్తును మొదలు పెట్టారు. త్వరలోనే ఇరు రాష్ట్రాల ఆఫీసర్లు, ప్రత్యేక టీమ్‌లు సరిహద్దు ప్రాంతాల్లో పర్యటించి మార్కింగ్‌లను ఫిక్స్ చేయనున్నారు. ఏపీ, తెలంగాణ వేర్వేరు రాష్ట్రాలుగా ఏర్పడి పదేళ్లుగా పూర్తికావడంతో గట్టు పంచాయితీలు తేల్చేందుకు ఇరు రాష్ట్రాల ఫారెస్ట్ ఆఫీసర్లు ఆదివారం హైదరాబాద్‌లో రివ్యూ నిర్వహించారు. సమస్యలు, పరిష్కారాలపై చర్చించారు. ప్రత్యేక ప్రణాళికలో ముందుకు వెళ్లాలని ఇరు రాష్ట్రాల అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇక అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ,నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్‌‌లలోని సమస్యలను పరిష్కరించాలని ఆఫీసర్లు ఈ మీటింగ్‌లో డిస్కషన్ చేశారు. ప్రధానంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించడంపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉన్నదని వివరించారు.

ఉభయ రాష్ట్రాలు చేపట్టిన ఉమ్మడి కార్యక్రమాలు, ముందుకు వెళ్లే మార్గాలపై నివేదిక తయారు చేశారు. నివాస నిర్వహణ, రక్షణకు సంబంధించిన అంశాలపై చర్చించారు. మరోవైపు తీర్థయాత్రల కోసం జనం తాకిడి విపరీతంగా పెరుగుతుండటం తో ఆయా ప్రాంతాల్లో ప్లాస్టిక్ బెడద ఎక్కువగా ఉన్నదని, దీన్ని నియంత్రించేందుకు తగిన స్థాయిలో చర్యలు తీసుకోవాలన్నారు. ప్లాస్టిక్‌ మహమ్మారితో ఆవాసాలకు జరిగే నష్టంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇక ప్రత్యేకంగా తాగునీటి కోసం ప్రత్యామ్నాయాన్ని అందించాల్సిన అవసరం ఉన్నదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ పీసీసీఎఫ్​ డోబ్రియల్, ఆంధ్రప్రదేశ్​ పీసీసీఎఫ్​చిరంజీవి చౌదరి, ఏపీ చీఫ్ వైల్డ్ వార్డెన్ ఏకే నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed