బ్రేకింగ్: సీఎం కేసీఆర్ హెలికాప్టర్‌లో మరోసారి సాంకేతిక సమస్య

by Satheesh |   ( Updated:2023-11-15 12:53:30.0  )
బ్రేకింగ్: సీఎం కేసీఆర్ హెలికాప్టర్‌లో మరోసారి సాంకేతిక సమస్య
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం కేసీఆర్ హెలికాప్టర్‌లో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సుడిగాలి పర్యటనలు చేస్తోన్న కేసీఆర్.. బుధవారం మెదక్‌లో బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభ ముగించుకుని తిరిగి హైదరాబాద్ బయలుదేరే సమయంలో హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యను పైలట్లు గుర్తించారు. కాగా సీఎం చాపర్‌లో సాంకేతిక సమస్య రావడం ఇది మూడోసారి. గతంలో మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లా పర్యటనల సమయంలోనూ హెలికాప్టర్ మొరాయించించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గాలను విస్తృతంగా చుట్టి వస్తున్న క్రమంలో కేసీఆర్ హెలికాప్టర్‌కు వరుసగా టెక్నికల్ సమస్యలు తలెత్తటం హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

Next Story