ఆ జిమ్​ సెంటరే వారి ​అడ్డా.. ఉగ్ర కుట్ర కేసులో వెలుగులోకి మరో కొత్త కోణం!

by Satheesh |   ( Updated:2023-05-13 02:07:46.0  )
ఆ జిమ్​ సెంటరే వారి ​అడ్డా.. ఉగ్ర కుట్ర కేసులో వెలుగులోకి మరో కొత్త కోణం!
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఉగ్ర కుట్ర కేసును తవ్విన కొద్దీ సంచలనాలు బయటకు వస్తున్నాయి. ప్రధాన సూత్రధారిగా మహ్మద్ యాసిన్​హైదరాబాద్​నుంచి కొంతమందిని భోపాల్‌కు పిలిపించుకుని అక్కడి యువకులకు ఆయుధ శిక్షణ ఇప్పించినట్టుగా స్పష్టమైంది. దీనిపై భోపాల్​యాంటీ టెర్రరిస్ట్​స్క్వాడ్​కోర్టుకు అందించిన నిందితుల రిమాండ్​రిపోర్టులోనూ స్పష్టంగా పేర్కొన్నట్టు తెలిసింది.

ఇక హైదరాబాద్‌కు వస్తే మత మార్పిడులతో మాడ్యూల్‌ను విస్తరించటంతో పాటు సాయుధ శిక్షణలో మహ్మద్​సలీంది ప్రధానపాత్ర అని తెలిపినట్టు సమాచారం. మహ్మద్​యాసిన్, మహ్మద్​సలీంల ప్రధాన లక్ష్యం మాడ్యూల్‌ను విస్తరించుకుంటూ పోయి ఇస్లామిక్​రాజ్యాన్ని(షరియా) ఏర్పాటు చేయటమే అని వివరించినట్టు తెలిసింది.

జిమ్‌కు వచ్చే వారిని పరియచం చేసుకుని..

ఐసిస్​కన్నా ప్రమాదకరమైన టెర్రరిస్ట్​ఆర్గనైజేషన్‌గా చెబుతున్న హిజ్బుత్​తహ్రీర్‌లో కీలక సభ్యుడైన మహ్మద్​యాసిన్​భోపాల్‌లో జిమ్​ట్రైనర్. కొన్నేళ్లుగా అక్కడ తన జిమ్‌కు వచ్చే వారిలో పదుల సంఖ్యలో యువకులను ఇస్లాం మతంలోకి మార్పించినట్టుగా ఏటీఎస్​పోలీసులు కోర్టుకు అందించిన రిమాండ్​రిపోర్టులో పేర్కొన్నట్టు తెలిసింది. జిమ్‌లో తనకు పరిచయమైన సౌరభ్ రాజ్ విద్యాను మత మార్పిడి చేసి మహ్మద్​సలీంగా మార్చి హైదరాబాద్‌లో మాడ్యూల్‌ను అభివృద్ధి చేయటానికి ఇక్కడికి పంపించాడు.

భోపాల్​ దగ్గరలోని అడవుల్లో..

యువకులను ఉగ్రవాదంవైపు మళ్లించడంతో పాటు భోపాల్‌కు దగ్గరలోని అటవీ ప్రాంతాల్లో ఆయుధాల వాడడంలో కూడా మహ్మద్ యాసిన్ శిక్షణ ఇప్పించినట్టు ఏటీఎస్​పోలీసుల రిమాండ్​రిపోర్ట్‌లో పేర్కొన్నట్టు తెలిసింది. ప్రధానంగా సమర్ధ జంగిల్, కేర్వా జంగిల్​ప్రాంతాల్లో ఇదంతా నడిచినట్టు వివరించింది.

అక్కడ రిసార్టులు ఉండగా.. టూరిస్టుల్లా తీసుకెళ్లే వాడని వివరించారు. ఆ తర్వాత దట్టమైన అటవీ ప్రాంతాల్లోకి నిపుణులను పిలిపించుకుని శిక్షణ ఇప్పించేవాడని తెలియజేశారు. పిస్టళ్లు, గన్లు కాకుండా గొడ్డళ్లు, కత్తులు, డాగర్లను వాడడంలో ట్రైన్ చేసినట్టు తెలిపారు. ఇద్దరిని త్వరలోనే కస్టడీకి తీసుకుని మరింత నిశితంగా విచారించాలని భోపాల్​ఏటీఎస్​అధికారులు భావిస్తున్నట్టు సమాచారం.

Advertisement

Next Story