- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాగార్జున సాగర్ జలాల విడుదల వివాదంలో మరో కీలక పరిణామం
దిశ, వెబ్‌డెస్క్: నాగార్జున సాగర్ జలాల విడుదల వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వివాదంపై కేంద్ర హోంశాఖ కల్పించుకుని పలు ప్రతిపాదనలు చేసింది. ఈ ప్రతిపాదనలకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అంగీకరించాయి. డ్యామ్ నిర్వహణను కృష్ణా వాటర్ బోర్డు మేనేజ్ మెంట్ బోర్డుకు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. నవంబర్ 28వ తేదీకి ముందున్న పరిస్థితులు కొనసాగించాలని హోంశాఖ తెలిపింది. సీఆర్పీఎఫ్ బలగాల పర్యవేక్షణకు అధికారులు అంగీకరించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన నాగార్జు సాగర్ ప్రాజెక్ట్ జల వివాదం ముగిసినట్లయింది.
అయితే నవంబర్ 29 న ఏపీ ఒక్క సారిగా భారీగా పోలీసులను మోహరించడం.. తెలంగాణ పోలీసులతో ఘర్షణకు దిగడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మరుసటి రోజు ఏపీ అధికారులు ఏకంగా కుడి కాలువ ద్వారా నీటిని విడుదలు చేసిన విషయం తెలిసిందే. ఇక, ఇదే విషయమై శుక్రవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ శాంతి కుమారి పలు కీలక విషయాలను కేంద్ర హోంశాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ఏపీ ప్రభుత్వం వ్యహరించిందన్నారు.