- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ ఆహ్వానం
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు మరొక అంతర్జాతీయ ఆహ్వానం లభించింది. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో జరిగే ఏషియా బెర్లిన్ సమ్మిట్ -2023 సదస్సుకి హాజరుకావాలని మంత్రి కేటీఆర్‌కు నిర్వాహకులు ఆహ్వానాన్ని అందించారు. ఈ సమావేశం జూన్ 12 నుంచి 15 వరకు జర్మనీలోని నగరంలో జరుగుతుంది. కనెక్టింగ్ స్టార్ట్ అప్ ఈకో సిస్టం అనే అంశంపైన ఈ సమావేశం జరుగుతుందని, ఈ సదస్సుకు హాజరు అయి, ప్రసంగించాలని మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది.
జర్మనీ సెనెట్‌కి చెందిన ఎకనామిక్స్, ఎనర్జీ, మరియు పబ్లిక్ ఎంటర్ప్రైజ్ శాఖ మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం పంపింది. ఈ సదస్సులో ప్రసంగించడం ద్వారా భారత్‌తో పాటు తెలంగాణ మరియు ఇతర దేశాల మధ్య బలమైన భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన ప్రయత్నాలను బలోపేతం చేయాలని కోరింది. ప్రతి ఏటా ఈ సదస్సు ద్వారా జర్మనీ మరియు అసియా దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను, భాగస్వామ్యాలను బలోపేతం చేసేందుకు నిర్వహిస్తారు. ముఖ్యంగా జర్మనీలో ఉన్న స్టార్టప్‌లను అసియా ఖండంలోని మార్కెట్లతో అనుసంధానం చేసేందుకు ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఈ సంవత్సరం జరగనున్న సదస్సు మొబిలిటీ, లాజిస్టిక్స్, ఎనర్జీ, గ్రీన్ టెక్, వాతావరణ మార్పులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ప్రధానమైన అంశాలను విస్తృతంగా చర్చిస్తుందని తెలిపారు. దీంతోపాటు ఈ సమావేశంలో భాగంగా పెట్టుబడిదారులకు ప్రత్యేకమైన సెషన్ ఉంటుందని, అద్భుతమైన ఐడియాలున్న స్టార్ట్ అప్ కంపెనీలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపింది. జర్మనీలో ఉన్న స్టార్టప్ ఈకో సిస్టం బలాన్ని అసియా ఖండంలోని స్టార్టప్‌లతో పంచుకునేందుకు ఈ సదస్సు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని నిర్వాహకులు మంత్రి కేటీఆర్‌కు పంపిన ఆహ్వానంలో పేర్కొన్నారు.