సిద్దిపేటకు మరో గౌరవం.. KCR విజన్‌తోనే సాధ్యమైందన్న హరీష్ రావు

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-12 05:58:48.0  )
సిద్దిపేటకు మరో గౌరవం.. KCR విజన్‌తోనే సాధ్యమైందన్న హరీష్ రావు
X

సిద్దిపేటకు మరో గౌరవం దక్కింది. స్వచ్ఛ సర్వేక్షణ్​లో మరోమారు అగ్రస్థానంలో నిలిచింది. 2023 త్రైమాసికానికి సంబంధించి ఫలితాల్లో జిల్లా పరిధిలోని 499 గ్రామాలు వివిధ కేటగిరీల్లో స్వచ్ఛ పల్లెలుగా గుర్తింపు పొంది జిల్లా 5స్టార్ కేటగిరి సాధించింది. ఈ సందర్భంగా మంత్రి హరీశ్​ రావు ప్రజాప్రతినిధులు, క్షేత్రస్థాయి అధికార యంత్రాంగం, సిబ్బందిని అభినందించారు. జాతీయ స్థాయిలో 5 జిల్లాలు ఎంపిక కాగా.. తెలంగాణ నుంచి మూడు జిల్లాలు అందులో సిద్దిపేట జిల్లా ఒకటి. సిద్దిపేట జిల్లా గతంలో 4 స్టార్ సాధించి ఇప్పుడు 5వ స్టార్ సాధించడం విశేషం. - దిశ, సిద్దిపేట ప్రతినిధి

స్వచ్ఛ సర్వేక్షణ్ లో సిద్దిపేట జిల్లా మరోమారు అగ్రస్థానంలో నిలిచింది. 2023 త్రైమాసికానికి సంబంధించి ఫలితాలల్లో జిల్లా పరిధిలోని 499 గ్రామాలు వివిద కేటగిరీల్లో స్వచ్చ పల్లెలు గా గుర్తింపు పొంది..జిల్లా 5స్టార్ కేటగిరి సాధించింది. గ్రామంలోని అన్ని కుటుంబాలకు వ్యక్తి గత మరుగుదొడ్డి, వినియోగించడం, పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలు, పంచాయతీ కార్యాలయంలో పురుషులకు, స్త్రీలకు ప్రత్యేక మరుగుదొడ్లు ఉండి వినియోగించడం, గ్రామంలోని అన్ని బహిరంగ ప్రదేశాలలో కనీస చెత్తా చెదారం, మురుగునీరు నిలిచే ప్రదేశాలు తక్కువగా ఉండి ప్లాస్టిక్ వ్యర్థాలను బహిరంగ ప్రదేశాలల్లో వేయకుండా ఉండటం, గ్రామంలో కుటుంబ, కమ్యూనిటీ స్థాయిలో ఘన వ్యర్థల నిర్వహణకు తగిన అన్ని ఏర్పాట్లు ఉండటం, గ్రామంలో ఓడీఎఫ్ ప్లస్, ఐఈసీ సందేశాలను ప్రముఖంగా ప్రదర్శించేలా వాల్ పెయింటంగ్స్/ బిల్ బోర్డులు ఏర్పాటు తదితర అంశాల సమర్థవంతంగా నిర్వహణకు 500 మార్కులకు గాను, 300 మార్కులతో 5 స్టార్ కెటగిరి సాదించింది.

ఈమేరకు జిల్లాలోని అన్నీ గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, క్షేత్రస్థాయి అధికార యంత్రగాన్ని, సిబ్బందిని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య మంత్రి తన్నీరు హరీశ్ రావు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం కేసీఆర్ విజన్ తో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితోనే ఇది సాధ్యమైందని మంత్రి పేర్కొన్నారు. దీనికి తోడు గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రగతి కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయడం, ప్రజల భాగస్వామ్యం, ప్రజాప్రతినిధుల, అధికారుల పని తీరు చొరవ తోనే గ్రామాలు సంపూర్ణ స్వచ్ఛ పంచాయతీలుగా రూపుదిద్దుకోన్నాయన్నారు. అదే విధంగా గ్రామపంచాయతీలో పారిశుధ్య, వివిధ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసి స్వచ్చ స్ఫూర్తితో ముందుకు సాగుతున్న ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ సిబ్బందికి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అభినందనలు తెలిపారు. ఇదిలా ఉండగా జాతీయ స్థాయి లో 5 జిల్లాలు ఎంపిక కగా.. తెలంగాణ నుండి 3 జిల్లాలు అందులో సిద్దిపేట జిల్లా ఒకటి. కాగా సిద్దిపేట జిల్లా గతంలో 4 స్టార్ సాధించిన సిద్దిపేట ఇప్పుడు 5వ స్టార్ కేటగిరీ సాధించింది.


Also Read.

ముస్లిములుగా మారింది ఎందరు.. ఉగ్ర కేసులో రంగంలోకి ఎన్ఐఏ?

Advertisement

Next Story

Most Viewed