ఆరేళ్ల చిన్నారి ఘటన మరవకముందే.. మరో చిన్నారిపై లైంగిక దాడికి యత్నం

by Rajesh |
ఆరేళ్ల చిన్నారి ఘటన మరవకముందే.. మరో చిన్నారిపై లైంగిక దాడికి యత్నం
X

దిశ, పెద్దపల్లి/ సుల్తానాబాద్ : ఎనిమిదేళ్ల చిన్నారిపై 70 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి యత్నించిన సంఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంటలో చోటుచేసుకుంది. అభం శుభం తెలియని చిన్నారిపై మూడు రోజుల క్రితం తాత వరస అయిన వ్యక్తి లైంగిక దాడికి యత్నించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్నారి తల్లిదండ్రులకు జరిగిన విషయం తెలియజేయడంతో వారు సుల్తానాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

చిన్నారిపై లైంగిక దాడికి ప్రయత్నించిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ నెల 13న రాత్రి సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని ఓ రైస్ మిల్లులో ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం జరిగిన విషయం ప్రజలు మర్చిపోకముందే మరో చిన్నారిపై లైంగిక దాడి జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటేనే మరోసారి ఇటువంటి సంఘటనలు జరగవని ప్రజాసంఘాలతో పాటు పలువురు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story