- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేనికి ఊహించని షాక్.. సొంత పార్టీ నుంచే తిరుగుబాటు
దిశ ప్రతినిధి, కొత్తగూడెం: కలిసి ఉండే కమ్యూనిస్టు పార్టీలో అసమ్మతి సెగ భగ్గుమంటుంది. కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా కొత్తగూడెం నియోజకవర్గ సీటును సీపీఐ కైవసం చేసుకోవాలని గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్న తరుణంలో సొంత పార్టీకి చెందిన కౌన్సిలర్లు తిరుగుబాటుకు సిద్ధపడ్డారు. పొత్తు ఉన్నా లేకున్నా సీపీఐ పార్టీ నుండి జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్న షాబీర్ భాషకు కొత్తగూడెం టికెట్ ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పారు. లేనిపక్షంలో సీపీఐ పార్టీ నుంచి గెలిచిన ఎనిమిది మంది కౌన్సిలర్లు మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని రహస్య సమావేశంలో తీర్మానించుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీంతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న కూనంనేని సాంబశివరావుకు ఊహించని షాక్ తగిలిందని చెప్పవచ్చు.
గతంలో బిఆర్ఎస్ పార్టీ పొత్తులో భాగంగా టికెట్ తనకే వస్తుందని ఎదురుచూసిన సాంబశివరావుకు బిఆర్ఎస్ మొదటి విడత అభ్యర్థుల జాబితా విడుదల అయిన తరుణంలో కాంగ్రెస్‌తో పొత్తుల కోసం ముందు అడుగేశారు. ఇంకేముంది కాంగ్రెస్ పొత్తులో భాగంగా కొత్తగూడెం సీటు సీపీఐ పార్టీకి వస్తుంది అన్న నేపథ్యంలో సొంత పార్టీలో కుంపటి మొదలైంది. జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్న యువ నాయకుడైన షాబీర్ భాషకు సీటు ఇవ్వకుంటే మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని 8 మంది కౌన్సిలర్లు రహస్య సమావేశం అవ్వడం పార్టీ వర్గాలను విస్మయానికి గురి చేసే అంశంగా మారింది. ఒకవేళ కాంగ్రెస్ పొత్తులో భాగంగా కూనంనేని సాంబశివరావుకు సీటు ఇచ్చినా తమకున్న ద్వితీయ స్థాయి నాయకులు పూర్తి మద్దతు తెలియజేస్తారా? లేదా? ఆధిపత్య పోరుకు తెరదీసి రాష్ట్ర కార్యదర్శిని ఓటమికి దారి చూపిస్తారా? అన్న అనుమానం నియోజకవర్గ ప్రజలను వెంటాడుతుంది. పొత్తులో సిపిఐ పార్టీకి టికెట్ ఇచ్చినా అసమ్మతి నేతలతో ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.