హైదరాబాద్‌ ఐసీఎఫ్ఏఐ యూనివర్సిటీలో దారుణం.. విద్యార్థినిపై యాసిడ్ దాడి

by srinivas |   ( Updated:2024-05-16 11:12:55.0  )
హైదరాబాద్‌ ఐసీఎఫ్ఏఐ యూనివర్సిటీలో దారుణం.. విద్యార్థినిపై యాసిడ్ దాడి
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఐసీఎఫ్ఏఐ యూనివర్సిటీలో విద్యార్థినిపై యాసిడ్ ఎటాక్ ఘటన జరిగింది. యూనివర్సిటీ హాస్టల్‌ విద్యార్థిని లేఖ్య స్నానం చేసే నీటి బకెట్‌లో అగంతకులు యాసిడ్ పోశారు. అయితే నీరే అనుకుని విద్యార్థిని ఒంటిపై యాసిడ్‌ను పోసుకున్నారు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఒక్కసారిగా లేఖ్య అరుపులు, కేకలతో తోటి విద్యార్థినిలు, కాలేజీ యాజమాన్యం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం లేఖ్య పరిస్థితి విమమంగా ఉందని తెలుస్తోంది. ఈ ఘటనతో యూనివర్సిటీలో ఒక్కసారిగా కలకలం రేగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితురాలు బీటెక్ చదువుతున్నట్లు గుర్తించారు. ఆస్పత్రిలో ఆమె నుంచి వాంగ్మూలం నమోదు చేశారు. అనుమానితులను పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అయితే యూనివర్సిటీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. విద్యార్థిని లేఖ్యపై జరిగిన దాడికి నిరసనగా మిగిలిన విద్యార్థులు ఆందోళనకు దిగారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విద్యార్థిని లేఖ్యకు న్యాయం చేయాలని కోరారు.

Advertisement

Next Story