- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడు అంబేడ్కర్ భారీ విగ్రహావిష్కరణ.. పూర్తి షెడ్యూల్ ఇదే..!
దిశ, వెబ్‌డెస్క్: నేడు నెక్లెస్ రోడ్డులో అంబేడ్కర్ భారీ విగ్రహావిష్కరణను అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. దేశంలోనే ఎత్తైన అంబేడ్కర్ విగ్రహావిష్కరణను సీఎం కేసీఆర్ చేయనున్నారు. మధ్యాహ్నాం 2 గంటలకు అంబేడ్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. బౌద్ధ గురువుల ప్రార్థనల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ ప్రోగ్రామ్ కు ముఖ్య అతిథిగా అంబేడ్కర్ మనవడు ప్రకాష్ అంబేడ్కర్ హాజరుకానున్నారు.
పార్లమెంట్ ఆకారంలో నిర్మించిన అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కోసం 2 గంటలకు సీఎం కేసీఆర్ ప్రాంగణానికి చేరుకుంటారు. ముందుగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. తర్వాత ఆడిటోరియం భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం అంబేడ్కర్ పాదాల వద్దకు చేరుకుని బౌద్ధ గురువుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆపై విగ్రహావిష్కరణ చేస్తారు. ఈ సందర్భంగా హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిసేలా ఇప్పటికే ఏర్పాట్లు చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ప్రారంభోపన్యాసం చేస్తారు. అనంతరం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ముఖ్య అతిథి ప్రకాష్ అంబేడ్కర్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ ప్రసంగం ఉండనుంది. సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి రాహుల్ బొజ్జా కృతజ్ఞతలు తెలపడం ద్వారా సాయంత్రం ఐదు గంటలకు సభ ముగియనుంది.