Allu Arjun: చిక్కడపల్లి పోలీసులకు అల్లు అర్జున్ కీలక హామీ

by Gantepaka Srikanth |
Allu Arjun: చిక్కడపల్లి పోలీసులకు అల్లు అర్జున్ కీలక హామీ
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌(Chikkadpally Police)లో సినీ నటుడు అల్లు అర్జున్(Allu Arjun) విచారణ ముగిసింది. సుమారు మూడున్నర గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై న్యాయవాదుల సమక్షంలో పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా స్టే‌ట్‌మెంట్‌ను రికార్డు చేశారు. ఏసీపీ రమేశ్, ఇన్స్‌పెక్టర్ రాజు నాయక్ సమక్షంలో ఈ విచారణ జరిగింది. అవసరమైతే మరోసారి విచారణకు రావాలని పోలీసులు ఆదేశించగా.. తప్పకుండా సహకరిస్తానని అల్లు అర్జున్ హామీ ఇచ్చారు. విచారణ అనంతరం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి బన్నీ బయలుదేరారు. ఆయనతో తన తండ్రి, నిర్మాత అల్లు అరవింద్‌, మామ చంద్రశేఖర్‌రెడ్డి, బన్నీ వాసు ఉన్నారు.

Advertisement

Next Story