- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Alleti Maheshwar Reddy: సంతాప దినాల్లో న్యూ ఇయర్ వేడుకలా.. రాహుల్‌పై ఏలేటి హాట్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: ఆర్థిక వేత్తగా దేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh) ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు ప్రజలు ఎన్నటికీ మరువబోరని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏటేటి మహేశ్వర్ (Alleti Maheshwar Reddy) రెడ్డి అన్నారు. ఇవాళ అసెంబ్లీ (Assembly)లో మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానంపై ఆయన మాట్లాడుతూ.. నిగమ్‌బోధ్ (Nigambodh)లో కేంద్ర ప్రభుత్వం (Central Government) మన్మోహన్ సింగ్ జ్ఞాపకార్థంగా స్మారక చిహ్నం ఏర్పాటు చేయబోతోందని తెలిపారు. అయితే, గతంలో పీవీ నరసింహా రావు (PV Narsimha Rao) ప్రధానిగా ఉండి చనిపోయాక.. ఆ నాడు కేంద్రంలో అధికారంలో ఇదే కాంగ్రెస్ పార్టీ (Congress Party) వారి కుటుంబ సభ్యులకు ఢిల్లీ (Delhi)లో ఇంచు స్థలం కూడా కేటాయించలేదని ఆరోపించారు. ఆయనకు భారతరత్న (Bharat Ratna) కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం కేంద్రంలో నరేంద్ర మోడీ (Narendra Modi) ప్రభుత్వం వచ్చాకే పీవీ నరసింహా రావును భారతరత్నతో సత్కరించుకున్నామని పేర్కొన్నారు. ఓవైపు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చనిపోతే.. వారం రోజుల పాటు కేంద్రం సంతాప దినాలను ప్రకటించిందని తెలిపారు. అయితే, అవేమి పట్టకుండా లోక్‌సభ పక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మాత్రం న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనేందుకు వియాత్నం (Vietnam) వెళ్లడం మన్మోహన్ సింగ్‌ను అవమానించడమేనని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. అయితే, ఏలేటి కామెంట్స్‌పై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది.