తెలంగాణ కొత్త ఎంపీలకు పార్టీ చీఫ్ ఖర్గే గ్రాండ్ డిన్నర్ పార్టీ..

by Ramesh N |
తెలంగాణ కొత్త ఎంపీలకు పార్టీ చీఫ్ ఖర్గే గ్రాండ్ డిన్నర్ పార్టీ..
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కొత్తగా ఎంపికైన కాంగ్రెస్ ఎంపీలకు రేపు డిన్నర్ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎంపీలకు టీపీసీసీ సమాచారం అందించింది. దీంతో తెలంగాణ నుంచి గెలిచిన ఎనిమిది మంది ఎంపీలు ఈ విందు పార్టీకి రానున్నారని తెలిసింది. దీంతో పాటు రేపు మధ్యాహ్నం తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుండగా.. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో సహా సీడబ్ల్యూసీ సభ్యులు, ఏఐసీసీ నేతలు, సీనియర్ నేతలు హాజరుకానున్నారు. వీరు కూడా డిన్నర్ పార్టీలో హాజరు కానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

రేపు సీడబ్ల్యూసీ మీటింగ్

జూన్ 8న ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం కాబోతోంది. రేపు ఉదయం 11:30 గంటలకు సమావేశం నిర్వహించబోతున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత తొలిసారి సమావేశం కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది.

Advertisement

Next Story