ఆగని గల్ఫ్ కార్మికుల మరణాలు.. స్వదేశానికి చేరిన రాజా రెడ్డి మృతదేహం

by Sathputhe Rajesh |
ఆగని గల్ఫ్ కార్మికుల మరణాలు.. స్వదేశానికి చేరిన రాజా రెడ్డి మృతదేహం
X

దిశ, మల్లాపూర్ : తెలంగాణ వస్తే తమ బతుకులు మారుతాయని భావించిన గల్ఫ్ కార్మికుల బతుకుల్లో మార్పు రాలేదు. సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగులు, గల్ఫ్ కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగానే ఉంది. తొమ్మిదేళ్ల పాటు అధికారంలో ఉండి గల్ఫ్ బోర్డు ఏర్పాటులో ప్రభుత్వం నిర్లక్షంగా వ్యవహరించింది. ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. గల్ఫ్ దేశాల్లో తెలంగాణకు చెందిన కార్మికులు మరణించినా వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవడం లేదు.

అమ్మ నాన్న‌ను భార్య పిల్లలను వదిలి కుటుంబ పోషణకై గల్ఫ్ దేశానికి వెళ్లి హార్ట్ ఎటాక్‌తో మండలంలో నెల రోజుల వ్యవధిలో ముగ్గురు విగత జీవులైయారు. వారి కుటుంబ సభ్యులకు కన్నీళ్ల మిగులుతున్నాయి. మండలంలోని కొత్త ధాం రాజ్ పల్లి గ్రామ వాసి కాసర్ల పెద్ద రాజారెడ్డి(49), లక్ష్మి దంపతులు వీరికి ముగ్గురు కూతుళ్లు జ్యోతి, భారతి, నిరోష, ఒక కుమారుడు హరీష్ ఉన్నారు. రాజారెడ్డి కుటుంబ పోషణ కోసం గల్ఫ్ దేశమైన దుబాయ్‌కి ఐదు సంవత్సరాల క్రితం వెళ్ళాడు. తన చిన్న కుమార్తె నిరోష‌కు కోరుట్ల పట్టణానికి చెందిన ప్రశాంత్‌తో వివాహం నిశ్చయం కాగా, ఫిబ్రవరి 24న వివాహం రోజున పెళ్లి కొడుకు ప్రశాంత్ తండ్రి గంగారాం హార్ట్ ఎటాక్ తో మృతిచెందాడు.

దీంతో పెళ్లి ఆగిపోయింది. పెళ్లి‌తో అప్పటివరకు ఉన్న సంతోషంగా గడిపిన కుటుంబం మరణ వార్త విని తట్టుకోలేకపోయారు. దుబాయ్‌లో ఉన్న కాసర్ల రాజారెడ్డి ఈ వార్త విని కుంగిపోయాడు. శుక్ర‌వారం రోజున గుండె పోటు‌తో మృతిచెందాడు. గల్ఫ్ జే‌ఏ‌సి చొరవతో తెలంగాణ ప్రభుత్వం ఉచిత అంబులెన్స్ సౌకర్యం కల్పించింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సహాయం చేసి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Advertisement

Next Story