Rain Alert:మళ్లీ వాన గండం..రాష్ట్రంలోని ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన

by Jakkula Mamatha |   ( Updated:2024-09-05 11:42:41.0  )
Rain Alert:మళ్లీ వాన గండం..రాష్ట్రంలోని ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన
X

దిశ,వెబ్‌డెస్క్:గత నాలుగైదు రోజుల నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఇక భారీ వర్షాలు(Heavy Rains) ఖమ్మం జిల్లాను వరద(Flood) నీటితో ముంచెత్తాయి. అయితే తాజాగా తెలంగాణ(Telangana)లో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. పశ్చిమ మధ్య పరిసర వాయవ్య బంగాళాఖాతం(Bay of Bengal)లో అల్పపీడనం ఏర్పడినట్లు పేర్కొంది. దీనికి అనుబంధ ఆవర్తనం సముద్రమట్టం నుంచి 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపింది.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నేటి(గురువారం) నుంచి మరో నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ(Weather) శాఖ తెలిపింది. ఇవాళ కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అలాగే రేపు ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఈ క్రమంలో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్(Yellow Alert) జారీ చేసింది. ఈ క్రమంలో రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed