- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బాధిత కుటుంబాలను ఆదుకుంటాం..
దిశ, తాండూర్ : అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన సల్పల గూడ బాధిత కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకుంటామని కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాపరిషత్ చైర్ పర్సన్ కోవలక్ష్మి అన్నారు. బాధిత కుటుంబాలను బుధవారం ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి గిరిజనుల ఆరుఇండ్లు దగ్ధమై సర్వం కోల్పోవడం దురదృష్టకరమన్నారు. ఇండ్లు నిర్మించుకోవడానికి ఐటిడీఏ ద్వారా రేకులను మంజూరు చేయించేందుకు కృషి చేస్తానన్నారు.
ప్రభుత్వపరంగా బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందే విధంగా అధికారులు కృషిచేయాలని సూచించారు. బాధితులకు ఆర్థిక సాయం, నిత్యవసర వస్తువులు, బట్టలు, వంటపాత్రలను అందజేశారు. ఆమెవెంట తిర్యాణి ఎంపీపీ శ్రీదేవి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ యాదవరావు, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జగదీష్, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు గుణవంత్ రావు, ఎంపీటీసీ కేశవరావు, సర్పంచులు జంగు, సుజాత, చిన్నరాజు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ శ్రీనివాస్, నాయకులు రాజయ్య, మధుకర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.