అతలాకుతలం..ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా విస్తారంగా వానలు

by Aamani |
అతలాకుతలం..ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా విస్తారంగా వానలు
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం తెల్లవారుజామున మొదలుకుని రాత్రి దాకా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం స్తంభించిపోయింది. తూర్పు జిల్లాలో కొంత వర్షాల ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ పశ్చిమ జిల్లాలో వర్ష ప్రభావం తీవ్రంగా కనిపించింది. ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు అన్నీ నిండాయి. ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. జిల్లాలోని స్వర్ణ, గడ్డెన్న వాగు, కడెం, సదర్ మాట్, మత్తడివాగు, సాత్నాల, కరత్ వాడ ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. ఇక మారుమూల అటవీ మండలాలైన వేమనపల్లి, కోటపల్లి, పెంబి, బెజ్జూరు, కౌటాల, సిర్పూర్ యు, జై నూరు, నార్నూర్, గాదిగూడ, బజార్హత్నూర్, నేరడిగొండ తదితర మండలాల్లో వాగులు, వంకలు పొంగి పొట్లడంతో రాకపోకలు స్తంభించిపోయాయి.

ప్రాజెక్టులు.. నిండు కుండలు

ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో కడెం ప్రాజెక్టు సహా మిగిలిన ప్రాజెక్టులు నిండుతున్నాయి. వరద పోటెత్తింది. కడెం ప్రాజెక్టులోకి ఆదివారం ఉదయం 65130 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండడంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు 10 వరద గేట్లు ఎత్తివేశారు. ఎగువ నుంచి ఇన్ఫ్లో క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో 10 వరద గేట్ల ద్వారా 79850 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 695 కు చేరింది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 7.603 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.361 టీఎంసీల నీరు ప్రాజెక్టులో నిల్వ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఖానాపూర్ లో...

ఖానాపూర్ మండలం లో కురుస్తున్న భారీ వర్షాలు దాటికి రెంకోని వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది... వాగు ఉధృతికి దిలావర్పూర్ వద్ద తాత్కాలిక రోడ్డు తెగిపోయింది. దీంతో ఖానాపూర్ కడెం మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఖానాపూర్ నుండి కడెం వెళ్లాలన్న కడెం నుండి ఖానాపూర్ రావాలన్న అదనంగా 10 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది.

కుంటాల మండలంలో...

కుంటాల మండలంలో భారీ వర్షం వెంకూర్ ఓలా లో లెవెల్ వంతెనలపై నుండి ప్రవహిస్తున్న నీరు ఓలా సూర్య పూర్ మెదక్ పూర్ కొత్త వెంకుర్ పాత వెంకుర్ గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు..

స్వర్ణ ప్రాజెక్ట్ గేట్ల ఎత్తివేత...

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం లో గల స్వర్ణ ప్రాజెక్టు ఎగువ ప్రాంత మైన మహారాష్ట్ర లోగత రెండు రోజుల నుంచి కురిసిన భారీ వర్షానికి స్వర్ణ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది దీంతో ప్రాజెక్టు మొత్తం నీటి సామర్థ్యం 1183 అడుగులకు గాను అడుగుల 1183 వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు మూడు గేట్ల ను ఎత్తి 22080 వేళా క్యూసెక్కుల వరద నీరును దిగువ ప్రాంతానికి వదిలిపెట్టారు ప్రస్తుతం 20000 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది అలాగే స్వర్ణ వాగు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులు తెలిపారు.దీంతో పాటు చెరువు లు కుంటలు వరద నీరు తో నిండి పోవడంతో పాటు పంట పొలాల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

గడ్డెన్న వాగు గేట్లు ఎత్తివేత..

ముధోల్ నియోజకవర్గం లోని గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు వరద నీరు పెరుగుతున్నది. గరిష్ట నీటిమట్టానికి చేరుకోవడంతో ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed