- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుబీర్ ఏఎంసీ చైర్మన్ పదవి ఎవరికి దక్కేనో..!
దిశ, కుబీర్ : కుబీర్ ఏఎంసీ చైర్మన్ పదవీ కాలం డిసెంబర్ 18తో ముగిసింది. ప్రస్తుత చైర్మన్ ఎంపికకు రిజర్వేషన్లలో ఎస్సీ వర్గానికి కేటాయించారు. మూడు నెలల కాలం ముగుస్తున్నా ఇంకా కొత్త వారిని ఎంపిక చేయడంలో జాప్యం జరుగుతూ వస్తున్నది. ఆశావాహులు మద్దతును కూడా కట్టుకొని పదవి ధక్కించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మార్కెట్ పరిధిలోకి ఇతర మండలాలతో సంబంధం లేకున్నా, పల్సిగ్రామంలో సబ్ మార్కెట్ యార్డ్ ఉంది. ఇక్కడ కూడా మార్కెట్ గిడ్డంగి, మార్కెట్కు కొన్ని ఎకరాల స్థలం కూడా ఉంది. కుబీరు మండలం జనాభాలోను విస్తీర్ణంలోను పరిధిలోను జిల్లాలో అతిపెద్దది.
దీంతో చైర్మన్ పదవి ఎంపిక కోసం ఆచితూచి ఆలోచించాల్సిన పరిస్థితి ఉందని నాయకులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే మండలంలో బీఆర్ఎస్ నాయకుల వర్గ పోరు నివ్వురు కప్పిన నిప్పులా రాజుకుంటున్నది. వాట్సాప్ గ్రూపుల్లోను ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న సందర్భాలు సైతం షికారు చేశాయి. ఇటీవలే ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి ఎడమొఖాలు, పెడమోఖాలు ఉన్న మండల నాయకులందరిని ఒక దగ్గర చేర్చి నిప్పు ఆర్పే ప్రయత్నాలు చేసిన ఫోటోలు ఆ గ్రూపుల్లో షికారు చేశాయి. ఈ కుమ్ములాటలోనే ఎవరికి కేటాయించాలో సంధిగ్ధంలో పడ్డారు నాయకులు. ఇప్పటికే పలువురు ఎస్సీ నాయకులు ఎమ్మెల్యేను కలిసి చైర్మన్ పదవికి తన పేరును ప్రతిపాదించాలని ప్రయత్నాలుచేసినట్లు సమాచారం.
తెలంగాణ ఉద్యమం నుండి పనిచేసిన వారికా, ప్రస్తుతం క్రియాశీలకంగా ముందుండి నడుస్తున్న వారికా, ఆ సామాజిక వర్గంలో మంచి పేరున్న నాయకుడికి ఇవ్వాలా అన్న విషయాలపైనే చర్చలు జరుగుతున్నట్లు పలువురు అంటున్నారు. పదవికాలం ముగిసిమూడు నెలల కాలంగడుస్తుంది. అభివృద్ధి కుంటూ పడుతుందని, కొత్తగా చైర్మన్ ఎంపిక చేసి అభివృద్ధి పథంలో తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేయాలని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.