కోతులను వెంబడించి తరిమిన గ్రామస్తులు..

by Sumithra |
కోతులను వెంబడించి తరిమిన గ్రామస్తులు..
X

దిశ, మామడ : అసలే' కోతి, ఆపై వనం వీడింది, జనంలోకి వచ్చింది. ఆహారం కోసం ఇండ్ల మీద, పంట పొలాల, ఆరబెట్టిన గింజల మీద దాడులు చేస్తున్నాయి. కోతుల వికృత శ్రేష్టలు మితిమీరిపోవడంతో వీటి బాధలనుంచి ఎలాగైనా విముక్తి పొందాలని గ్రామస్తులు నిర్ణయించారు.

ఆదివారం మండలంలోని పొన్కల్ గ్రామంలో ప్రతిసంఘము నుంచి పదిమంది చొప్పున సుమారుగా 200మంది వీధుల వెంబడి తిరుగుతూ కోతులను వెంబడించి గ్రామం నుంచి అటవీ ప్రాంతానికి తరలించారు. ప్రతిరోజు కోతుల బెడదతో జనాలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. యువకులు వివిధ రకాల జంతువుల మాస్కులు ధరించడంతో కోతులు వీరిని చూసి పరారయ్యాయి. ఏది ఏమైనా కోతులబెడద నుంచి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story