ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో చోరీ

by Mahesh |
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో చోరీ
X

దిశ ప్రతినిధి నిర్మల్: దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో చోరీ కలకలం రేపుతుంది. రాత్రి పది గంటల సమయంలో దుండగుడు బాసర అమ్మవారి ఆలయంలో ప్రవేశించి అంతరాలయంలోని హుండీలను పగలగొట్టి చోరీకి పాల్పడ్డాడు. అనంతరం అక్కడే ఉన్న ప్రధాన హుండీని తెరవడానికి శతవిధాల ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. అగంతకుడు బాసర అంతరాలయంలో రాత్రి 10 గంటల 20 నిమిషాలకు చొరబడి 11:40 నిమిషాలకు బయటకు వెళ్లినట్లు సీసీ ఆధారంగా తెలుస్తుంది. అయితే దాదాపు గంటపాటు అంతరాలయంలో ఉన్న దుండగుడిని అక్కడ హోమ్ గార్డ్ సిబ్బంది గమనించకపోవడం గమనర్హం. కేవలం రాత్రి 10 గంటల సమయంలో అగంతకుడు ఆలయంలో చొరబడుతున్న భద్రత సిబ్బంది గమనించకపోవడం నిర్లక్ష్యానికి పరాకాష్ట గా మారిందని స్థానికులు ఫైర్ అవుతున్నారు.

బాసర ఆలయంలో గతంలో ఓ సైకో కత్తితో గర్భాలయంలో ప్రవేశించి తనను తాను గాయపరచుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న ఇంటెలిజెన్స్ బ్యూరో బాసర ఆలయంలో భద్రతా వైఫల్యం ఉందని గతంలో ఇంటెలిజెన్స్ రాష్ట్ర దేవదాయ శాఖకు హెచ్చరించినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం, భద్రత వైఫల్యానికి మచ్చుతునకగా చెబుతున్నారు. ప్రస్తుతం బాసర ఆలయంలో పోలీసులు సంఘటన పరిసరాలను డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story