వీడిన కిడ్నాప్ మిస్టరీ.. అసలేమయిందో తెలుసా..

by Sumithra |
వీడిన కిడ్నాప్ మిస్టరీ.. అసలేమయిందో తెలుసా..
X

దిశ, సారంగాపూర్ : నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో వంజర్ గ్రామంలో మంగళవారం రాత్రి దొంగల భయానికి గస్తి కాస్తున్న గ్రామస్తులు అనుమానాస్పదంగా మోటార్ సైకిల్ పై వెళుతున్న వ్యక్తులను రాత్రి పట్టుకున్నారు. కాగా వారి వద్ద ఓ పిస్తోల్ లభించింది. దాంతో గ్రామస్థులు వెంటనే సారంగాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. కాగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ముఠా సభ్యులు ఐదుగురిని అరెస్టు చేసి వారి వద్ద పిస్తోల్, రెండు తూటాలు, ఐదు సెల్ ఫోన్లు రెండు మోటార్ సైకిల్ స్వాధీనపరుచుకున్నారు.

గురువారం నిర్మల్ లో విలేకరుల సమావేశంలో ఎస్పీ ప్రవీణ్ కుమార్ కేసు వివరాలు వెల్లడించారు. అక్రమంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో జగిత్యాల జిల్లా, ముద్దులపల్లి గ్రామానికి చెందిన బానోత్ మారుతి, మహారాష్ట్రకు చెందిన ఇద్దరు వ్యక్తులు, ఒక వివాహితతో కలిసి ముఠాగా ఏర్పడి కుట్రపన్ని పథకం ప్రకారం పెద్దపల్లి జిల్లా కుమ్మరి కుంట గ్రామానికి చెందిన ఆర్ఎంపీ అక్కిరాల రవికుమార్ ను కిడ్నాప్ చేశారు. అనంతరం బెదిరించి డబ్బుల కోసం డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ముఠాలోని ఐదుగురు సభ్యులు ను పోలీసులు అరెస్టు చేయగా సహకరించిన మిగతా ఇద్దరూ పరారీలో ఉన్నారని తెలిపారు.

సారంగాపూర్ జౌళి గ్రామానికి చెందిన వివాహిత (22) గత ఆరు నెలల క్రితం కుమ్మరి కుంట గ్రామానికి చెందిన వ్యక్తితో పెళ్లి జరిగింది. వివాహిత తనకి పిల్లలు కలగడం లేదని ఆర్ఎంపీ డాక్టర్ రవిని తరచూ సంప్రదిస్తూ ఉండడంతో వారి మధ్య పరిచయం ఏర్పడిందనీ, దీంతో ఫోన్ ద్వారా మాటలతో ప్రలోబ పెట్టి ముఠా సభ్యులతో కలిసి రవి వద్ద డబ్బు గుంజడానికి పథకం పన్నిందని తెలిపారు. ఆమె మాయ మాటలు నమ్మిన రవి ఆమె వద్దకు చేరుకొనగా వివాహిత తన బంధువు కారులో ఎక్కించుకుని ధనోరా ఆటవీ ప్రాంతంలో తీసుకెళ్లింది.

అనంతరం అక్కడికి రెండు మోటార్ సైకిల్ పై ముఠా సభ్యులు చేరుకున్నారు. మారుతి, ఉద్ధవ్ కార్తీక్, జ్ఞానేశ్వర్లు కలిసి ఆర్ఎంపీ రవిని కాళ్లు, చేతులు కట్టి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాంతో బెదిరిపోయిన ఆర్ఎంపీ డాక్టర్ తనని నిర్మల్ తీసుకెళ్లాలని కోరాడు. నిందితులు రవిని తీసుకెళ్లే క్రమంలో వంజర్ గ్రామస్తులు రాత్రి 11:30 నిమిషాలకు వారిని పట్టుకున్నారు. వెంటనే పోలీసులకి సమాచారం అందించడంతో మహారాష్ట్ర ముఠానీ పట్టుకున్నారు. పరారీలో ఉన్న అంకముల్లా శ్రావణ్, రాహుల్ రాజాక్ నీ త్వరలో పట్టుకుంటామని ఎస్పీ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed