డాక్టర్ అవతారమెత్తిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

by Sathputhe Rajesh |
డాక్టర్ అవతారమెత్తిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
X

దిశ, బోథ్: మంత్రి ఒకేసారి డాక్టర్ అయ్యారు. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు స్వెతాకోప్ పెట్టి హార్ట్ బీట్ చెక్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ హోమియోపతి వైద్యుడు రవి కిరణ్ తన 12వ బ్రాంచ్ అదిలాబాద్ లో ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంకి ముఖ్య అతిధిగా న్యాయ,దేవాదాయ,అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వచ్చారు. అయితే ప్రారంభం అయిన తరవాత మంత్రి డాక్టర్ అవతారం ఎత్తి అక్కడ ఉన్న బోథ్ ఎమ్మెల్యే బాపురావు కి హెల్త్ చెక్ అప్ చేశారు. అక్కడ ఉన్న వారు అందరూ మంత్రి గారు డాక్టర్ అయ్యారు అనుకున్నారు. ఈ కార్యక్రమం లో అదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న,జెడ్పీ చైర్మన్ జనార్ధన్, హోమియోపతి వైద్యుడు రవికిరణ్ యాదవ్ ఉన్నారు.

Advertisement

Next Story