ప్రశాంతంగా ముగిసిన గ్రూప్1 ప్రిలిమినరీ పరీక్షలు

by Sumithra |   ( Updated:2022-10-16 10:02:46.0  )
ప్రశాంతంగా ముగిసిన గ్రూప్1 ప్రిలిమినరీ పరీక్షలు
X

దిశ, బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో గ్రూప్ వన్ ప్రిలిమ్ నరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. పట్టణంలోని ఆరు పరీక్షా కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు 2655 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా, 2043 మంది హాజరయ్యారు. 612 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. పట్టణంలోని బాలికల జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రానికి రెండు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన ముగ్గురిని, బాలుర జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రానికి రెండు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన ఇద్దరు అభ్యర్థులను పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ వెనక్కి పంపించారు. బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్ ఆధ్వర్యంలో పరీక్ష కేంద్రాల వద్ద భారి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story