- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Sirpur MLA : బెజ్జూర్ పీఎసీఎస్‌లో పది కోట్ల అవినీతి జరిగింది
దిశ, బెజ్జూర్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలోని సహకార సంఘం కార్యాలయంలో పది కోట్లు అవినీతి అక్రమాలు జరిగాయని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. గురువారం బెజ్జూరు మండల కేంద్రంలో సహకార సంఘం కార్యాలయం ముందు బీజేపీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు పాల్గొని ప్రసంగించారు. బెజ్జూర్ సహకార సంఘం కార్యాలయంలో పది కోట్లు అవినీతి అక్రమాలు జరిగాయని సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బెజ్జూర్ సహకార సంఘం కార్యాలయంలో లోన్లు తీసుకొని మరణించిన రైతులకు రుణాలు ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి రైతులకు న్యాయం అయ్యేంతవరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు బెజ్జూర్ కోపరేటివ్ సొసైటీలో డిపాజిట్ చేద్దామని రైతులు వస్తే, ప్రైవేట్ ఆదర్శ కోపరేటివ్ సొసైటీలో డిపాజిట్లు చేసి రైతులను మోసం చేశారని ఆయన ఆరోపించారు. దీంతో రైతులు మోసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల మోసాలపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. కొమురం భీం జిల్లాలోని బెజ్జూర్, దహేగాం,రెబ్బెన సొసైటీలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సొసైటీలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టి బాద్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. రైతుల కోసం ఏర్పాటు చేసిన సహకార సంఘాలు రైతులను మోసం చేస్తే ఎలా అని ప్రశ్నించారు. బెజ్జూర్ సొసైటీలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. రుణమాఫీ పేరుతో రైతుల ప్రభుత్వం మోసగించిందన్నారు. రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షలకు పైన ఉన్న వారికి మాఫీ చేయకుండా డెడ్ లైన్ ప్రకటించకుండా రైతులను మోసం చేస్తుందన్నారు రెండు లక్షలకు పైనున్న రుణాల వారికోసం డెడ్ లైన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఏకకాలంలో 2 లక్షల రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రేషన్ కార్డు లేకుండా రుణమాఫీ చేపట్టాలని డిమాండ్ చేశారు.
రుణమాఫీ లో రైతులకు అన్యాయం జరిగిందన్నారు కొందరికి రుణాలు కాదు. అందరికీ రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొంగ సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి ధోని శ్రీశైలం, జిల్లా అధ్యక్షుడు అశోక్, మాజీ ఎంపీపీ కొప్పుల శంకర్, బిజెపి మండల అధ్యక్షుడు ఉమ్మెర బాలకృష్ణ, జూన్ గారి మధుకర్, బిజెపి నాయకులు వశీఖాన్, తేలి బాపు, తాళ్ల రామయ్య, మోహన్, సామల తిరుపతి, దిగంబర్ ,చప్పిడి సత్యనారాయణ, సంతోష్ గణపురం నాగేష్, మల్లయ్య, భీంకర్ హనుమంతు తదితరులు పాల్గొన్నారు.