- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఘనంగా సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..
దిశ,మందమర్రి: మందమర్రి లోని సింగరేణి పాఠశాల మైదానం లో సింగరేణి 136 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో జిఎం దేవేందర్, సేవా సమితి ప్రెసిడెంట్ స్వరూప రాణి పాల్గొన్నారు.ముందుగా గౌరవ వందనం స్వీకరించి సింగరేణి పతాక ఆవిష్కరణ చేశారు. అనంతరం సింగరేణి సంస్థకు సంబంధించిన పలుడిపార్ట్మెంట్ల స్టాల్స్ ను,తినుబండారాల స్టాల్స్ ను,సేవా స్టాళ్లను జిఎం జి.దేవేందర్ ప్రారంభించారు.అనంతరం వారు మాట్లాడుతూ అన్ని గనులకు దీటుగా సింగరేణి సంస్థ పని చేస్తుందని అన్నారు. బొగ్గు ఉత్పత్తి ధ్యేయంగా కాకుండా చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధికి కూడా బాధ్యతగా పనిచేస్తుందని అలాగే కొత్త గనులకు ప్రారంభ దిశగా సిఅండ్ఎండి బలరాం నాయక్ ఆధ్వర్యంలో కార్యాచరణ మొదలు పెట్టారు అని చెప్పారు.
మందమర్రి ఏరియా బొగ్గు ఉత్పత్తిలో 73% లక్ష్యం సాధించడం ఆనందంగా ఉందని చెప్పారు.ఉత్తమ ఉద్యోగులకు మరియు సాంస్కృతిక కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎస్.ఓ.టు జి.ఎం విజయ్ ప్రసాద్, మందమర్రి ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ,బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్, రామకృష్ణాపూర్ బ్రాంచ్ సెక్రటరీ అక్బర్ అలీ,సీఎంఓఏఐ అధ్యక్షుడు రవి, పర్సనల్ మేనేజర్ ఎస్ ఎస్.శ్యాంసుందర్, డి.వై పి.ఎం ఆసిఫ్ ఏరియా అధికారులు,జి.ఎం ఆఫీసు సిబ్బంది,సింగరేణి ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు యూనియన్ నాయకులు పాల్గొన్నారు.