- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దులో భద్రత కట్టుదిట్టం.. ఎన్నికల నేపథ్యంలో విస్తృత తనిఖీలు
దిశ ప్రతినిధి, నిర్మల్: ఈ నెల 20న జరగనున్న మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ సరిహద్దుతో పోలీసుల మోహరింపుతో కట్టుదిట్టమైన భద్రత పెంచారు. విస్తృత తనిఖీలతో పాటు మహారాష్ట్రకు వెళ్లే అటు నుంచి ఇటు వచ్చే వాహనాలపై నిఘా పెంచి ప్రతి వాహనాన్ని జల్లెడ పడుతున్నారు. నగదు మద్యం తరలింపుపై ఫిర్యాదుల నేపథ్యంలో మహారాష్ట్ర సరిహద్దులను పోలీసు బలగాలతో కట్టుదిట్టం చేసినట్లు ఉమ్మడి జిల్లా పోలీసు యంత్రాంగం చెబుతోంది. ఎన్నికలకు మరో రెండు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల ఎస్పీలు మంచిర్యాల జిల్లాకు సంబంధించి రామగుండం సీపీ ఆధ్వర్యంలో నిరంతర నిఘా పెంచి తనిఖీలు చేపడుతున్నారు. ఉన్నతాధికారులు స్వయంగా సరిహద్దుల వద్ద తనిఖీలు చేపడుతుండడంతో సరిహద్దు పోలీస్ స్టేషన్ల ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, కిందిస్థాయి పోలీస్ సిబ్బంది కంటికి కునుకు లేకుండా పర్యవేక్షణలో నిమగ్నమవుతున్నారు.
నగదు, మద్యంపై నిఘా..?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చుట్టూ మహారాష్ట్ర ప్రాంతం ఉన్న నేపథ్యంలో.. తెలంగాణ ప్రాంతం నుంచి మహారాష్ట్రలోకి వెళ్లాలంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి నాలుగు జిల్లాల గుండానే దారులు ఉన్నాయి. నిర్మల్ జిల్లా స్వర్ణ, బిద్రెల్లి, తానూరు, బెళ్తారోడా, ఆదిలాబాద్ జిల్లా బోరజ్, బేల, ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి, గోయగాం, కాగజ్ నగర్, బెజ్జూర్ మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం మీదుగా మహారాష్ట్రకు రహదారులు ఉన్నాయి. ఆర్టీసీ తో పాటు ప్రైవేట్ వాహనాలు ఈ రహదారుల గుండానే రాకపోకలు సాగిస్తాయి. తెలంగాణ, మహారాష్ట్ర నడుమ అనేక వ్యాపార సంబంధాలతో పాటు బంధుత్వాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ఎన్నికలపై తెలంగాణ ప్రభావం విపరీతంగా కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రాంతం నుంచి మహారాష్ట్రలోకి ఎన్నికల్లో డబ్బులు తరలించే అవకాశాలు ఉన్నాయని కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం అందినట్లు చెబుతున్నారు. అలాగే ఎన్నికలకు ముందు మహారాష్ట్రలో మద్యం దుకాణాలు మూసి ఉంచే ఆదేశాలు ఉండడంతో సరిహద్దుల్లో పోలీసు నిఘా భారీగా పెంచారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న అంతర్రాష్ట్ర చెక్ పోస్టులతో పాటు, ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ లు, పిల్ల దారులను సైతం పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఆ దారిన వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ తరువాతనే వదిలిపెడుతున్నారు. అనుమానితులను చెక్ పోస్టుల వద్ద పోలీసులు ప్రశ్నించి వదిలిపెడుతున్నారు.
తనిఖీల్లో పోలీసు ఉన్నతాధికారులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మీదుగా మహారాష్ట్రలోకి ఉన్న అంతరాష్ట్ర సరిహద్దులతో పాటు ఇతర రహదారుల వద్ద పో లీసుల తనిఖీలు విస్తృతంగా పెరిగాయి. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో నగదు మద్యం తెలంగాణ ప్రాంతం నుంచి మహారాష్ట్రకు తరలించే అవకాశాలు ఉన్నాయంటూ ఎన్నికల సం ఘానికి అందిన ఫిర్యాదుల మేరకు పోలీసుల తనిఖీలు విస్తృ తంగా పెంచారు. స్వయంగా ఆయా జిల్లాల ఎస్పీలు రంగం లోకి దిగి తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు. కిందిస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేసి తనిఖీలను పెంచారు. నిర్మల్ ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల మహారాష్ట్ర సరిహద్దు స్వర్ణ, రామ్ సింగ్ తండా వద్ద తనిఖీల్లో పాల్గొన్నారు. ఆదివారం ఆమె రెండు గంటలపాటు అక్కడ తమ సిబ్బందితో వాహనాల తనిఖీలను పరిశీలించారు. ఆసిఫాబాద్ ఎస్పీ శ్రీనివాసరావు, ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం, మంచిర్యాల జిల్లాకు సంబం ధించి రామగుండం సీపీ శ్రీనివాసులు మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో వాహనాల తనిఖీలను సరిహద్దుల వద్ద పోలీసుల మోహరింపు వ్యవహారాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. తె లంగాణ నుంచి మహారాష్ట్రకు వెళ్లే వాహనాల నంబర్లను ఫో టోలు వీడియోలు తీయడంతో పాటు పోలీసులు తమ వద్ద నమోదు చేసుకుంటున్నారు.