- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నివృత్తి చేస్తూ... నిషితంగా పరిశీలిస్తూ...
దిశ, తలమడుగు : తలమడుగు మండల కేంద్రం డోర్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్ సర్వే తీరును మంగళవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు. మొదట తలమడుగు మండల కేంద్రంలోని పలు కాలనీల్లో పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల సర్వే పని తీరును తెలుసుకున్నారు. ఆ తరువాత డోర్లి గ్రామంలో జరుగుతున్న సర్వేను నిషితంగా పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే యాప్ లో అర్హులైన వారందరినీ నమోదు చేసే విధంగా చూడాలని, ఎక్కడ కూడా తప్పులు లేకుండా సర్వేను కొనసాగించాలని కోరారు.
సర్వే కు ముందుగానే ప్రజలకు తెలియజేసి అవసరం అయిన డాక్యుమెంట్స్ ను తమ వద్ద ఉంచుకోవాలని కోరారు. కాగా సర్వేయాప్ కొంత మేర సరిగ్గా పని చేయడం లేదని, దాని వల్ల సర్వే ముందుకు వెళ్లడం లేదని సిబ్బంది కలెక్టర్ కు వివరించారు. దాంతో సమస్యలను నివృత్తి చేశారు. అలాగే సాధ్యమైనంత తొందరగా సర్వేను వేగవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమర్వో రాజ్ మోహన్, ఎంపీడీఓ శేఖర్, పంచాయతీ సెక్రటరీ గజానాన్, సర్వేయర్ అపర్ణ, ఇందిరమ్మ, ఇళ్ల కమిటీ సభ్యులు అసం రవి, రావుల నారాయణ, గ్రామస్తులు పాల్గొన్నారు.