అట్టహాసంగా ముగిసిన రేణుక ఎల్లమ్మ ప్రతిష్టాపన ఉత్సవాలు

by Disha Web Desk 22 |
అట్టహాసంగా ముగిసిన రేణుక ఎల్లమ్మ ప్రతిష్టాపన ఉత్సవాలు
X

దిశ, ప్రతినిధి నిర్మల్: నిర్మల్ సమీపంలోని అక్కాపూర్ గ్రామ సమీపంలో గత ఐదు రోజులుగా కొనసాగిన రేణుక ఎల్లమ్మ ప్రతిష్టాపన ఉత్సవాలు గురువారం సాయంత్రంతో ముగిసాయి. రేణుక ఎల్లమ్మ జమదగ్ని పరశురాముడు ఆది వినాయకుడు సహా ఇతర దేవతల విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. మధ్యాహ్నం ఐదు రోజులుగా నిర్వహించిన మహా యాగశాల పూర్ణాహుతితో సంపూర్ణం చేశారు. అనంతరం మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో రేణుక ఎల్లమ్మ ఆలయానికి చేరుకున్నారు. దైవజ్ఞ గురుమంచి చంద్రశేఖర్ శర్మ ఆధ్వర్యంలో రేణుక ఎల్లమ్మ, జమదగ్ని కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, నిర్మల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కే శ్రీహరి రావు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ శోభ సత్యనారాయణ గౌడ్, డీసీసీబీ మాజీ చైర్మన్ కె రామ్ కిషన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జి. ఈశ్వర్, సహకార సంఘం చైర్మన్ గంగాధర్, కాలేశ్వరం ఆలయ కమిటీ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. నిర్మల్ గీత పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు గౌడ సంఘం ప్రతినిధులు కార్యక్రమాన్ని నిర్వహించారు.


Next Story

Most Viewed