నాలా ఆక్రమణల తొలగింపు..మరో ఐదుగురికి నోటీసులు జారీ

by Aamani |
నాలా ఆక్రమణల తొలగింపు..మరో ఐదుగురికి నోటీసులు జారీ
X

దిశ, ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కబ్జాకు గురైన నాలా ఆక్రమణను రెవెన్యూ అధికారులు తొలగించారు. ఆసిఫాబాద్ కు చెందిన హాసన్ అనే వ్యక్తి టీఆర్ నగర్ లో గల నాలాను మట్టితో పూడ్చి చి 10 గుంటల వరకు ల్యాండ్ లెవెల్ చేసుకుని చుట్టూ ప్రహరీ గోడ కట్టి నాలాను కబ్జా చేసినట్లు ఫిర్యాదు రావడంతో రెవెన్యూ అధికారులు వెళ్లి పరిశీలించగా నాలా కబ్జాకు గురైనట్లు గుర్తించి, సదరు వ్యక్తికి నోటీసులు జారీ చేశారు. స్పందించకపోవడంతో బుధవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఆర్డీవో లోకేశ్వర్ రావు ఆధ్వర్యంలో పోలీసుల బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు జేసీబీతో నాలా ఆక్రమణను హైదరాబాద్ హైడ్రా తరహాలో తొలగించారు.

బిడీపీపీ ప్రభుత్వ భూముల్లో మరో ఐదుగురు కబ్జా చేసినట్లు గుర్తించి, వారికి కూడా నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. సదరు వ్యక్తులకు ఇచ్చిన గడువులోపు ఆక్రమణలను తొలగించకుంటే మేమే తొలగిస్తామని ఆర్డీవో లోకేశ్వర్ రావు పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడా బిడీపీపీ ప్రభుత్వ భూములను కబ్జా చేసినట్లు, కానీ వెంచర్ లు వేసి విక్రయించినట్లు తమ దృష్టికి వస్తా, విచారణ జరిపి వాటిని తొలగిస్తామని ఆర్డీవో హెచ్చరించారు. హైదరాబాద్ హైడ్రా తరహాలో రెవెన్యూ అధికారులు ఆక్రమణలను తొలగిస్తామని హెచ్చరించడంతో ఆక్రమణదారుల గుండెల్లో గుబులు మొదలైంది. మరోవైపు భూ అక్రమణల తొలగింపు పై జిల్లాలోని ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed