శ్రీరెడ్డి సారీల పర్వం.. ఫస్ట్ జగన్, ఆ తర్వాత లోకేశ్

by srinivas |
శ్రీరెడ్డి సారీల పర్వం.. ఫస్ట్ జగన్, ఆ తర్వాత లోకేశ్
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు కేసులు కొనసాగుతున్నాయి. బాధితులు ముందుకు వచ్చి పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో అరెస్ట్‌లు సైతం కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నటి శ్రీరెడ్డి మరోసారి లేఖ రాశారు. ఈసారి మాజీ సీఎం జగన్‌తో పాటు మంత్రి లోకేశ్‌కు కలిపి ఒకే లేఖ రాశారు. ముందుగా లేఖలో జగన్ ఫ్యామిలీపై ప్రస్తాంచారు.

మాజీ సీఎం జగన్, భారతీని దగ్గర నుంచి చూసే అదృష్టం తనకు లేదని, టీవీల్లో చూసి ఆనందిస్తానని చెప్పారు. తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు తీసుకువచ్చానని, పార్టీలో సభ్యురాలిని కాకపోయినా తన వాణి బలంగా వినిపించనని పేర్కొన్నారు. కానీ తన వ్యాఖ్యలతోవైసీపీకి నష్టం జరుగుతుందని తాను అంచనా వేయలేదని, ఇప్పుడు అసలు విషయాలను గ్రహించానని, అందువల్ల పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని శ్రీరెడ్డి పేర్కొన్నారు.

మంత్రి నారా లోకేష్ అన్నా అంటూ.. ‘‘ నాకు ఇష్టమైన దైవంపై ప్రమాణం చేసి చెబుతున్నా. ఇక ఎప్పుడూ ఇబ్బంది కలిగించే రీతిలో వివాదాస్పద కామెంట్స్ చేయను. నన్ను క్షమించండి. వారం రోజులుగా ఆహారం, నిద్ర లేకుండా బాధతో కుమిలిపోతున్నా. నాతో పాటు నా కుటుంబ సభ్యులు అనుభవించిన క్షోభ వేల సంవత్సరాలకు సరిపడా అనుభవించా. ఇప్పటికైనా ననను వదిలివేయండి.’’ అని శ్రీరెడ్డి విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed