Samsung Galaxy S25 launch: శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 సిరీస్ లాంచ్ డేట్ లీక్..!!

by Anjali |
Samsung Galaxy S25 launch: శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 సిరీస్ లాంచ్ డేట్ లీక్..!!
X

దిశ, వెబ్‌డెస్క్: చాలా రోజుల నుంచి శాంసగ్ గెలాక్సీ ఎస్ 25 సిరీస్(Samsung Galaxy S25 series) గురించి సోషల్ మీడియాలో ఎన్నో పుకార్లు వింటున్నాం. న్యూ మోడల్ ఫోన్ అలా ఉండబోతుంది.. ఇలా ఉండబోతుందంటూ అనేక పుకార్లు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా శాంసంగ్ గెలాక్సీకి సంబంధించి ఓ అప్డేట్ వచ్చింది లేటెస్ట్ గా ఒక ఎక్స్ యూజర్ శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 సిరీస్ లాంచ్ తేదీని వెల్లడించారు. రీసెంట్‌గా జరిగిన ఒక శాంసంగ్ సర్వేలో ఈ డేట్ రిలీజ్ చేశారు. గెలాక్సీ ఎస్ 25 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ ప్రీ-ఆర్డర్ తేదీని వచ్చే ఏడాది జనవరి 5వ తేదీగా తెలిపారు. ప్రీ-ఆర్డర్ డేట్ కంటే కొన్ని డేస్ ముందే లాంచ్ ఉండనుందని గెలాక్సీ ఎస్ 25 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ ఉండవచ్చని ఆ ఎక్స్ యూజర్ తెలిపాడు.

‘‘గెలాక్సీ ఎస్ 25 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ కోసం జనవరి 5 నుంచి ప్రి ఆర్డర్ చేసుకోవచ్చు’’ అంటూ శాంసంగ్ సర్వేలో పేర్కొన్న విషయాన్ని ఆ యూజర్ రాసుకొచ్చాడు. ఇక ఈ ఏడాది (2024) శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 సిరీస్‌ను జనవరి 17 న లాంచ్ చేసింది. అప్పుడు ప్రకటించిన డేట్ కన్నా ముందే లాంచ్ చేయడంలో ఇప్పుడు కూడా అలాగే ఊహించిన దానికంటే ముందే లాంచ్ అవ్వనుందని భావిస్తున్నారు.

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 సిరీస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

గెలాక్సీ ఎస్ 25 ప్లస్(Galaxy S25 Plus), గెలాక్సీ ఎస్ 25 (Galaxy S25), గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా(Galaxy S25 Ultra) అని శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 సిరీస్‌లో మూడు మోడల్స్ ఉంటాయి. గెలాక్సీ ఎస్ 25 స్లిమ్ అయితే వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు లాంచ్ అయ్యే చాన్స్ ఉందని జనాలు అంచనా వేస్తున్నారు. ఇక ఫీచర్లు చూసినట్లైతే.. గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా కెమెరా ఫుల్ క్లారిటీతో రానుందని..న్యూ ఫీచర్లతో పాటు అప్ గ్రేడ్‌లను పొందనుందని అనుకుంటున్నారు. గెలాక్సీ ఎస్ 25 సిరీస్ ఎక్సినోస్(Exynos) 2500 లేదా.. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్(Qualcomm Snapdragon 8 Elite Chipset) తో పనిచేస్తుందని పుకార్లు షికార్లు కొడుతున్నాయి.

Advertisement

Next Story