- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
నా చావుతో మీ సమస్యలు తీరాలి.. కన్నీళ్లు పెట్టిస్తున్న విద్యార్థి సూసైడ్ నోట్..
దిశ, కుత్బుల్లాపూర్ : అమ్మ నాన్న నన్ను క్షమించండి. నా చావుకు కొందరు బాధ్యులు.. నాతో కావట్లేదు.. నా చావు తర్వాత మీకు సమస్యలు తీరాలి.. ఇలా హృదయ విధారకంగా ఓ స్టూడెంట్ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, కళాశాల సిబ్బంది తెలిపిన వివరాలు ప్రకారం హైదరాబాద్ నగరం లోని నిజాంపేట్ జర్నలిస్ట్ కాలనీలో గల శ్రీ చైతన్య బాయ్స్ క్యాంపస్ కళాశాలలో కామారెడ్డి జిల్లాకు చెందిన రాజు, రాధికల కుమారుడు జస్వంత్ గౌడ్ (17)ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
చదువులో బ్రిలియంట్ గా ఉండే జస్వంత్ గౌడ్ మూడవ అంతస్తులో తాను నిద్రిస్తున్న హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరేసుకుని గురువారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన తోటి విద్యార్థులు కేకలు వేస్తూ హాస్టల్ వార్డెన్ కు తెలపడంతో పోలీసులకు, విద్యార్ధి తల్లిదండ్రులకు సమాచారం అందించి స్టూడెంట్ ను చికిత్స కోసం నిజాంపేట్ రోడ్డులోని హోలీస్టిక్ హాస్పిటల్ కు తరలించారు. పరీక్షించిన వైద్యులు విద్యార్థి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం స్టూడెంట్ జస్వంత్ గౌడ్ మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కు తరలించారు. విద్యార్ధి పేరెంట్స్ కళాశాలకు వస్తే మృతికి గల పూర్తి కారణాలు తెలిసే అవకాశం ఉంది. బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
స్టూడెంట్ మృతితో.. అంతుచిక్కని అనుమానాలు..
శ్రీ చైతన్య కళాశాలలో విద్యార్ధి జస్వంత్ గౌడ్ మృతిలో అంతుచిక్కని అనుమానాలు కనిపిస్తున్నాయి. తాను నిద్రిస్తున్న హాస్టల్ లో స్టూడెంట్ తో పాటు మరో నలుగురు నిద్రిస్తున్నారు. అయితే స్టూడెంట్ ఫ్యాన్ కు ఉరివేసుకున్నాడని హాస్టల్ సిబ్బంది తెలుపుతున్నా ఫ్యాన్ కు వేసుకున్న ఉరి సీన్ చూస్తే పలు అనుమానాలను రేకెత్తిస్తుంది. ఫ్యాన్ రెక్కకు ఉరి వేసుకున్నట్లు కనిపిస్తుంది. అది కూడా స్టూడెంట్ దుప్పటితో ఉరి వేసుకున్నాడు అని చెబుతున్నారు. కానీ వాస్తవంగా అలా జరిగే అవకాశం లేదనే వాదన వినిపిస్తుంది. ఉరి ఫ్యాన్ రెక్కకు వేసుకుంటే రెక్క స్టూడెంట్ బరువుకు విరిగి పడే అవకాశం ఉంది. అలాగే ఫ్యాన్ అందుకోవడానికి చాలా హైట్ ఉంది. అలా వేస్తున్న టైమ్ లో మిగతా స్టూడెంట్స్ కీ అలజడి వచ్చే అవకాశం ఉంది. కానీ అలా కాకుండా స్టూడెంట్స్ నిద్రిస్తున్నారని, కళాశాల యాజమాన్యం నమ్మించేలా చేయడం పలు అనుమానాలకు తావిస్తుంది. పోలీస్ విచారణ, పోస్టు మార్టం రిపోర్ట్ లో మృతికి గల అసలు విషయాలు తెలియాల్సి ఉంది.