- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Hyderabad: పోలీసుల తనిఖీల్లో పట్టు బడ్డ తాగుబోతు వీరంగం
దిశ, వెబ్ డెస్క్: పోలీసుల తనిఖీ(Police Check)ల్లో పట్టు బడ్డ తాగుబోతు నడి రోడ్డుపై నానా రభస(ruckus) చేశాడు. హైదరాబాద్(Hyderabad) పాతబస్తీ చంపాపేట్ చౌరస్తాలో ఎంఐఆర్ చౌక్ ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్(MIR Chauk Traffic Sub-Inspector) అమరేందర్ రెడ్డి(Amarender Reddy) తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో మధ్యం సేవించిన ఓ వ్యక్తి అటుగా వచ్చి పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసులు అతని వద్ద తనిఖీలు చేయగా.. వాహనానికి నెంబర్ ప్లేట్లు గానీ, ఎటువంటి డాక్యుమెంట్స్ గానీ లేవు.
దీంతో పోలీసులు వాహానాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. దీంతో నడి రోడ్డు పైనే ఆ తాగుబోతు వీరంగం సృష్టించాడు. నేను ఏం తప్పు చేయనప్పుడు నా బండి ఎందుకు తీసుకెళ్తున్నారని వాగ్వాదానికి దిగాడు. పక్కనే ఉన్న ఇటుక రాయి తీసుకొని పోలీసుల మీదికి వెళ్లి, చివరికి ట్రాఫిక్ అధికారి కాళ్లు పట్టుకోడానికి ప్రయత్నం చేశాడు. అనంతరం ట్రాఫిక్ పోలీసులు అతన్ని పోలీసులకు అప్పజెప్పి, అతని వాహనాన్ని సీజ్(Seize The Vehicle) చేశారు. దీనికి సంబంధించిన వీడయో నెట్టంట చక్కర్లు కొడుతోంది.