Sajjanar : అవయవదానంతో ఐదుగురికి ప్రాణదానం : సజ్జనార్ అభినందనలు

by Y. Venkata Narasimha Reddy |
Sajjanar : అవయవదానంతో ఐదుగురికి ప్రాణదానం : సజ్జనార్ అభినందనలు
X

దిశ, వెబ్ డెస్క్ : వ్యక్తి మరణానంతరం ఐదుగురి (Five People)కి ప్రాణదాతగా నిలవడం కంటూ గొప్పతనం ఏముంటుందని సీనియర్ ఐపీఎస్ అధికారి, టీజీ ఆర్టీసీ ఎండీ వీ.సీ.సజ్జనార్ (VC Sajjanar)ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. పుట్టెడు దుఃఖంలోను అవయవాలే(Organ Donation)ను దానం చేసేందుకు ముందుకు వచ్చిన రైతు పుట్టి జంగయ్య కుటుంబసభ్యులది గొప్ప మనసని సజ్జనార్ అభినందించారు.

అమనగల్ మండలంకు చెందన మద్విన్ కు చెందిన రైతు పుట్టి జంగయ్య(74) కుటుంబం చేసిన అవయదానం ఐదుగురికి పునర్జన్మనిచ్చిందని సజ్జనార్ వెల్లడించారు. ఒకరికి లివర్, ఇద్దరికి కిడ్నీలు, ఇద్దరికి కళ్లను దానం చేశారని, అవయవదానానికి ముందుకొచ్చిన అతని కుటుంబాన్ని ఎంత పొగిడిన తక్కువేనని, ఇది అందరికి ఆదర్శనీయమని సజ్జనార్ కొనియాడారు.

Advertisement

Next Story

Most Viewed