Lagacharla: లగచర్ల దాడి కేసులో ఉన్నతస్థాయి దర్యాప్తు

by Gantepaka Srikanth |
Lagacharla: లగచర్ల దాడి కేసులో ఉన్నతస్థాయి దర్యాప్తు
X

దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్‌ జిల్లా లగచర్ల(Lagacharla) దాడి ఘటనపై ఉన్నతస్థాయి సమీక్ష ప్రారంభమయ్యింది. గురువారం ఉదయం అదనపు డీజీ మహేష్‌ భగవత్‌(DG Mahesh Bhagwat), ఐజీ సత్యనారాయణ(IG Satyanarayana)లు పరిగి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. లగచర్ల ఘటనపై దాడి, అరెస్ట్‌లపై పోలీస్‌(Telangana Police) ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. కాగా, భూ అభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్‌, అధికారులపై దాడి ఘటనను పోలీస్ శాఖ సీరియస్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 3 కేసులు నమోదు చేయగా.. దాదాపు 20 మందిని అదుపులోకి తీసుకుంది. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి(Narendar)తో పాటు కీలక సూత్రధారులు సురేష్‌, విశాల్‌ అరెస్ట్‌ అయ్యారు. మరోవైపు 3వ రోజు కూడా లగచర్లలో ఇంటర్ నెట్ సేవలు నిలిపివేశారు. లగచర్లలో ఘటన జరిగిన తర్వాత సోమవారం రాత్రి 10 గంటల నుంచి అంతర్జాల సేవలను నిలిపివేశారు. అప్పటి నుంచి ఆ సేవలను పునరుద్ధరించలేదు.

Advertisement

Next Story

Most Viewed