Kanguva Twitter Review: సూర్య ‘కంగువ’ సినిమా ట్విట్టర్ రివ్యూ.. టాక్ ఎలా ఉందంటే?

by Hamsa |
Kanguva Twitter Review: సూర్య ‘కంగువ’ సినిమా ట్విట్టర్ రివ్యూ.. టాక్ ఎలా ఉందంటే?
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ సూర్య, దిశా పటానీ(Disha Patani) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కంగువ’. ఈ చిత్రాన్ని శివ (Shiva)భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. పీరియాడిక్ యాక్షన్ ఫిలిమ్‌గా తెరకెక్కిన ఈ సినిమాను స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత జ్ఞానవేల్ రాజా(Jnanavel Raja), వంశీ. ప్రమోద్‌లు నిర్మించారు. నేడు (నవంబర్14) ‘కంగువ’ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న మూవీ ఎట్టకేలకు రిలీజ్ అవడంతో సూర్య ఫ్యాన్స్ మొదటి షోను చూసేశారు.

ఇక ‘కంగువ’(Kanguva) చిత్రాన్ని చూసినవారంతా సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ చిత్రంలో సూర్య(Suriya) యాక్టింగ్ అదిరిపోయింద‌ని అంటున్నారు. ఇక ఇంట్రడక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవ‌ల్ అని, వీఎఫ్ఎక్స్‌, యాక్షన్ సీన్స్(Action Scenes) బాగున్నాయ‌ని అంటున్నారు. ఇక క్లైమాక్స్ ఆక‌ట్టుకుంటుంద‌ని చెబుతున్నారు. మొత్తానికి ‘కంగువ’ (Kanguva) సినిమా పాజిటివ్ రెస్సాన్స్‌తో దూసుకుపోతుంది. సూర్య గత సినిమాలతో పోలిస్తే ఇది డిఫరెంట్ స్టోరీ కావడంతో థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.

Advertisement

Next Story